‘వాజీ’ ఆధ్వర్యాన రంగోలీ పోటీలు

Jan 13,2024 20:41

 ప్రజాశక్తి-విజయనగరం కోట  : మన సంస్కతీ సంప్రదాయాలకు ప్రతీకలు రంగోలీ పోటీలు అని వాజీ ఛానల్‌ ఎమ్‌డి గణపతినీడి శ్రీనివాసరావు అన్నారు. శనివారం ఉదయం ఆనందగజపతి ఆడిటోరియం ఆవరణలో వాజీ ఛానల్‌ నిర్వహించిన రంగోలి పోటీలు అందరినీ ఆకట్టుకున్నాయి. మహిళల సృజనాత్మకతకు అద్దం పట్టాయి. వందలాది మంది మహిళలు ఈ పోటీల్లో పాల్గొని ముగ్గులు వేవారు. పల్లె అందాలు, సంక్రాంతి సొగసులు ప్రస్ఫుటమయ్యాయి. అతిథిగా విచ్చేసిన ప్రముఖ టీవీ, సినీనటి పూజామూర్తి (గుండమ్మ కథ ఫేమ్‌) సందడి చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముగ్గు వేయడం మన సంప్రదాయంలో ఒక భాగమని, మగువల చేతుల్లోంచి అలవోకగా నేలపైకి జాలువారి, చూపరులను కట్టిపడేసే అద్భుతమైన, అందమైన ఒక న్కెపుణ్యం ముగ్గు అని అన్నారు. మేనేజింగ్‌ డెరెక్టర్‌ గణపతినీడి శ్రీనివాసరావు మాట్లాడుతూ గత 28 ఏళ్లుగా భారతీయ సనాతన సాంప్రదాయాలు, సంస్కతి పరిరక్షణలో భాగంగా మహిళలను ప్రోత్సహించేందుకు రంగోలీ పోటీలను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు.

➡️