పిడుగుపడి మృతిచెందిన కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది : ఎంపి నాగరాజు

Jun 17,2024 16:19 #ap government, #MP Nagaraju, #speech

ప్రజాశక్తి-తుగ్గలి (కర్నూలు) : పిడుగుపడి మృతి చెందిన కుటుంబాలకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని కర్నూల్‌ పార్లమెంట్‌ సభ్యులు బస్తి పాటి నాగరాజు అన్నారు. సోమవారం మండలం పరిధిలోని రామలింగాయ పల్లెలో ఎరుకల సుంకన్న, ఎరుకల రామేశ్వరి మృతదేహాలను పరిశీలించి నివాళులు అర్పించారు. బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి పదివేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ … విపత్తు వల్ల జరిగిన సంఘటన చాలా బాధాకరమన్నారు. గొర్రెల కాపరుల మీద ఇలాంటి దుశ్చర్య జరగడం విచారకరమన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం పూర్తిగా అండగా నిలబడుతుందన్నారు. బతికేవారిపై ఇలాంటి సంఘటన జరగడం దురదఅష్టకరమన్నారు. ప్రభుత్వము నుండి రావాల్సిన సహాయ సహకారాలు అందేవిధంగా జిల్లా అధికారులతో మాట్లాడి వారి కుటుంబాలకు సహాయం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్మన్‌ బత్తిన వెంకట రాముడు, మాజీ ఎంపీపీ కొమ్ము వెంకటేశ్వర్లు, సిపిఐ నాయకులు నబి రసూల్‌, టిడిపి ఎస్టీ స్టిల్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటపతి, వెంకట స్వామి, మాభాష,తదితరులు పాల్గొన్నారు.

మృతి చెందిన కుటుంబానికి ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి : సిపిఎం, సిపిఐ
తుగ్గలి మండలం పరిధిలోని రామలింగయ్యపల్లికి చెందిన ఎరుకల కామేశ్వరి, ఎరుకల సుంకన్న పిడుగు పడి మృతి చెందడంతో ఆ కుటుంబానికి ప్రభుత్వం ఒక్కొక్కరికి రు.25 లక్షలు చెల్లించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని సిపిఎం మండల కార్యదర్శి శ్రీరాములు, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. విపత్తు వల్ల జరిగిన సంఘటనకు ప్రభుత్వం అన్ని విధాలుగా ఆ కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు.

➡️