వారం రోజుల్లోగా పనులు పూర్తి చేయాలి

Feb 29,2024 21:26

ప్రజాశక్తి – పాచిపెంట : మండలంలోని కేసలి పోలింగ్‌ కేంద్రాన్ని గురువారం ఇన్‌ఛార్జి జాయింట్‌ కలెక్టర్‌ జెసి విష్ణు చరణ్‌ పరిశీలించారు. పోలింగ్‌ కేంద్రం మరమ్మతు పనులను పరిశీలిస్తూ మిగిలిన పనులను త్వరతగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మరమ్మతు పనులకు అవసరమైన నిధులను కలెక్టర్‌తో చర్చించి నిధులు చెల్లిస్తామన్నారు. అలాగే పాఠశాల నిధులుపై ఎంఇఒ జోగారావును ప్రశ్నించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులను సంప్రదించి నివేదిస్తానని తెలిపారు. ఎన్నికల నిర్వహణకు హాజరైన సిబ్బందికి ఎటువంటి అసౌకర్యాలు లేకుండా చూడాలని సూచించారు. ఆయన వెంట తహశీల్దార్‌ పి.బాల, డిప్యూటీ తహశీల్దార్‌ ఎం రాజశేఖర్‌ పాల్గొన్నారు.

➡️