వారపు సంతలో సూపర్‌ సిక్స్‌పై ప్రచారం

Mar 5,2024 21:45

ప్రజాశక్తి – కురుపాం : మండలంలోని మొండెంఖల్‌లో మంగళవారం జరిగిన వారపు సంతలో మండల కన్వీనర్‌ కెవి కొండయ్య ఆధ్వర్యంలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ సూపర్‌ సిక్స్‌ పథకాలపై నిర్వహించిన ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి టి. జగదీశ్వరి హాజరై సూపర్‌ సిక్స్‌ పథకాల గురించి సంతకు వచ్చిన ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రజల భవిష్యత్తుకు భరోసా కావాలంటే చంద్రబాబుతోనే సాధ్యమని, కావున రానున్న ఎన్నికల్లో కచ్చితంగా టిడిపికి ఓటు వేసి గెలిపించాలని కోరారు . కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్చార్జి కె.మల్లేసు, టిడిపి నాయకులు రంజిత్‌ కుమార్‌ నాయక్‌, వెంపటాపు భారతి తదితరులు పాల్గొన్నారు.పారిశుధ్యం పై టిడిపి ఆగ్రహంపార్వతీపురంరూరల్‌ :మున్సిపాలిటీ నిర్వహిస్తున్న పారిశుధ్య కార్యక్రమాలపై టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి బోనెల విజరు చంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబు షూరిటీ భవిష్యత్‌ గ్యారెంటీ, సూపర్‌ సిక్స్‌ కార్యక్రమం ప్రజల్లో తీసుకువెళ్లేందుకు వార్డుల్లో పర్యటిస్తూ మంగళవారం 9వ వార్డులో పర్యటించారు. వార్డులోని పలు వీధుల్లో కాలువల్లో పూడికతీయకపోవడంతో మురుగు నీరు వెళ్లే దారి లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్‌ పారిశుధ్య అధికారులు, స్థానిక కౌన్సిలర్‌ తీరును ఎండగట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో పారిశుధ్య కార్యక్రమాలు సక్రమంగా నిర్వహించకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురౌవుతున్నారని, దోమలు, ఈగలు విపరీతంగా పెరిగి, వార్డులోని ప్రజలు రోగాల బారిన పడుతున్నారని అన్నారు. ముఖ్యంగా 9వ వార్డు ప్రజలు సరైన మురుగు కాలువల్లేక రహదారుల పైన మురికి నీరు నిలిచిపోవడంతో ప్రజలు చాలా అవస్థలు పడుతున్నారని అన్నారు. ఇంత జరుగుతున్నా అధికారుల్లో ఏమాత్రం చలనం లేదని విమర్శించారు. ఇప్పటికైనా మున్సిపల్‌ అధికారులు స్పందించి వెంటనే వార్డు ప్రజలు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు . కార్యక్రమంలో టిడిపి, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.గిరిజన గ్రామాల్లో టిడిపి ప్రచారం మండలంలోని సంగందొరవలస, బుదువాడ, టేకు లోవ, బిత్తటోంకి గిరిజన గ్రామాల్లో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ పార్వతీపురం నియోజకవర్గం జనసేన-టిడిపి ఉమ్మడి అభ్యర్థి బోనెల విజరు చంద్ర పర్యటించారు. ఈ సందర్భంగా టిడిపి మేనిఫెస్టోలో సూపర్‌ సిక్స్‌ పథకాలు గురించి వివరించారు. కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షుడు బి.చంద్రమౌళి, కార్యదర్శి గురజాన చంద్రమౌళి, గంట సాయిరాంశంకారం, నేలపు సింహాచలం, గొట్టాపు వెంకట నాయుడు తదితరులు పాల్గొన్నారు.

➡️