వాలంటీర్ల సేవలు ఉపయోగకరం

Feb 20,2024 21:23

ప్రజాశక్తి-కాశినాయన గ్రామాలలో వాలంటీర్లు చేస్తున్న సేవలు ప్రజలకు ఉపయోగకరంగానే ఉన్నాయని ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ,ి్డ ఎమ్మెల్యే సుధా తెలిపారు. మంగళవారం మండల కేంద్రమైన నరసాపురంలోని వెలుగు సభాభవనంలో ఉత్తమ వాలంటీర్లకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. వాలంటీర్లు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రతినెలా 1 తెల్లవారుగానే వారి ఇళ్లకు వెళ్లి పింఛను పంపిణీ చేస్తున్నారు ఏది దరఖాస్తులు చేయాలన్నా వాలంటీర్ల ద్వారానే చేస్తారన్నారు. గత ప్రభుత్వంలో కార్యాలయాల చుట్టూ తిరిగి ప్రజలు ఇబ్బందులు పడేవారని వాపోయారు. ఆ ఇబ్బందులు ప్రజలకు ఉండకూడదనే ఉద్దేశంతో జగన్మోహన్‌ రెడ్డి వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేశారని తెలిపారు. అనంతరం ఉత్తమ వాలంటీర్లకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో వైసిపి యూత్‌ లీడర్‌ ఆదిత్య రెడ్డి, మార్కెట్‌ యార్డ్‌ మాజీ చైర్మన్‌ రమణారెడ్డి, ఎంపిడిఒ తహశీల్దార్‌, సచివాలయాల మండల కన్వీనర్‌ హనుమంత రెడ్డి, వైసిపి నాయకులు రామసుబ్బారెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, పిచ్చిరెడ్డి, రాఘవరెడ్డి, మిద్దెల జగన్‌ మోహన్‌ రెడ్డి, వైసిపి నాయకులు , వాలంటీర్లు పాల్గొన్నారు. కలసపాడు : ముఖ్యమంత్రి ఏర్పాటుచేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడంలో వాలంటీర్లది కీలకమైన పాత్ర అని బద్వేల్‌ నియోజకవర్గపు ఎమ్మెల్యే డాక్టర్‌ సుధ తెలిపారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాల యంలో వాలంటీర్లకు సేవా రత్న, సేవా మిత్ర, సేవ వజ్ర, పురస్కార అవార్డులను ఎంపిడిఒ కోటేశ్వర ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ డిసి గోవింద్‌రెడ్డి సారధ్యంలో, ఎమ్మెల్యే డాక్టర్‌ సుధా బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో వైసిపి రాష్ట్ర యువ నాయకులు, దేవసాని, ఆదిత్యరెడ్డి, మాజీ మార్కెట్‌ యార్డ్‌ వైస్‌ చైర్మన్‌ కరెంట్‌, రమణారెడ్డి, జడ్‌పిటిసి అంకన, గురువిరెడ్డి, ఎంపిపి బోధన బోయిన, నారాయణ, సింగిల్‌ విండో అధ్యక్షుడు పురుషోత్తంరెడ్డి, రాజుపాలెం సర్పంచ్‌, సుధా రామకష్ణారెడ్డి, వైసిపి మండల అధ్యక్షుడు సగిలి. సుదర్శన్‌, జెఎసి మండల కన్వీనర్‌ చిత్త, రాజశేఖర్‌రెడ్డి, కలసపాడు ఉప సర్పంచ్‌, వీరారెడ్డి, రాంబాబు, మండల బిసి సెల్‌ అధ్యక్షులు, రమేష్‌, వాలంటీర్లు, వైసిపి కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️