విఎస్‌ఆర్‌ స్టడీ సెంటర్‌ లోగో ఆవిష్కరణ

విఎస్‌ఆర్‌ స్టడీ సెంటర్‌ లోగో ఆవిష్కరణ

ప్రజాశక్తి కాకినాడపూర్వ ఎన్‌జిఒ అసోసియేషన్‌ నాయకులు, మార్క్సిస్టు నాయకులు వాసంశెట్టి సూర్యారావు స్మారకంగా యువతీ, యువకులకు, సామాజిక, సాంస్కతిక కార్యకర్తలకు విద్యా, వైజ్ఞానిక, రాజకీయ విద్య నెరపడం కోసం విఎస్‌ఆర్‌ ఐడియల్‌ స్టడీ సెంటర్‌ ప్రారంభమయ్యింది. దీని లోగోను వీక్షణం సంపాదకులు ఎన్‌.వేణుగోపాల్‌ గురువారం ఆవిష్కరించారు. ఎంఎల్‌సి ఇళ్ల వెంకటేశ్వరరావు (ఐవి), జన విజ్ఞాన వేదిక రాష్ట్ర గౌరవాధ్యక్షుడు డాక్టర్‌ స్టాలిన్‌ పాల్గోన్నారు. ఈ సందర్భంగా వక్తలు ప్రసంగిస్తూ సూర్యారావు ఆశయానికి అనుగుణంగా స్టడీ సెంటర్‌ ప్రారంభించడం అభినందనీయమన్నారు. కార్పొరేట్‌ సంస్థల అభీష్టానికి అనుగుణంగా సాగుతున్న నేటి విద్యా విధానం వల్ల అనేక అనర్థాలు జరుగుతున్నాయన్నాయని, స్వతంత్రంగా ఆలోచించే నైపుణ్యం కొరవడి పరాయీకరణ చెందుతున్న మనుషులకు ఒక మార్గం చూపాల్సిన అవసరం నెలకొన్న పరిస్థితుల్లో ఇటువంటి స్టడీ సెంటర్‌ ప్రారంభించడం మంచిదన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు తిరుమలశెట్టి నాగేశ్వరరావు, సామాజిక కార్యకర్తలు పెద్దింశెట్టి రామకృష్ణ, వి.రవికుమార్‌, సిహెచ్‌.కిరణ్‌ కుమార్‌, జి.చెల్లారావు, కార్మిక సంఘాల నాయకులు వి.చంద్రరావు, జి.రామకృష్ణ, కె.ప్రసాద్‌, సత్యనారాయణరెడ్డి, రచయిత ప్రకాశరావు పాల్గొన్నారు. లోగోను ఆకర్షణీయంగా డిజైన్‌ చేసిన బాలం హరికి అభినందనలు తెలిపారు.

➡️