వికలాంగుల రాస్తారోకో

ప్రజాశక్తి- కొత్తపట్నం : తమ స్థలాల నుంచి ఇసుక తరలింపును ఆపాలని కోరుతూ వికలాంగులు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల పరిధిలోని పాదర్తి గ్రామాల్లో వికలాంగులకు స్థలాలు మంజూరు చేసినట్లు తెలిపారు. అయితే కొందరు ట్రాక్టర్ల యాజమానులు తమ స్థలాల నుంచి అక్రమం ఇసుక తరలిస్తున్నట్లు తెలిపారు. వికలాంగుల రాస్తారోకో గురించి సమాచారం తెలుసుకున్న ఎస్‌ఐ సాంబశివరావు ఫోన్‌లో మాట్లాడారు. సెచ్‌ అధికారులు సాయంతో ట్రాక్టర్‌ యజమానులతో మాట్లాడి వారిపై తక్షణమే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అక్రమ మైనింగ్‌ కేసు వికలాంగుల 2016 చట్టం ప్రకారం కేసు నమోదు చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో వికలాంగులు రాస్తారోకో విరమించారు. ఈ కార్యక్రమంలో వికలాంగుల సంఘం నాయకులు సాయి జనార్ధన్‌, మధు నాంచార్లు ,శివయ్య, కాంతారావు ,కుమారి, లక్ష్మీనారాయణ ,రాఘవరావు తదితరలు పాల్గొన్నారు.

➡️