‘విదేశీ విద్యా దీవెన’ కింద రూ.1.58 కోట్లు

మెగా చెక్కు ను ఆవిష్కరిస్తున్న కలెక్టర్‌, ఎమ్మెల్యే, జడ్పి చైర్‌ పర్సన్‌ తదితరులు

పల్నాడు జిల్లా: పల్నాడు జిల్లాలో జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం కింద 20 మంది విద్యార్థులకు రూ 1.58 కోట్ల మెగా చెక్కు ను జిల్లా కలెక్టర్‌, ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి, జడ్‌పి చైర్‌ పర్సన్‌ తదితరులు బుధవారం ఆవిష్కరించారు. పేద విద్యార్థులకు సైతం విదేశాలలో పేరుగాంచిన యూనివర్సిటీ ల్లో ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం కల్పిస్తూ మరో వైపు సివిల్‌ సర్వీస్‌ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి అత్యున్నత స్థాయి విధానపరమైన నిర్ణయాల్లో భాగస్వామి కావాలన్న విద్యార్థుల కలలసాకారానికి ఆర్థిక తోడ్పాటు నందిస్తూ ‘జగనన్న విదేశీ విద్యాదీవెన’ ”జగనన్న సివిల్‌ సర్వీసెస్‌ ప్రోత్సాహకం’ నకు సంబంధించిన నిధులను బుధవారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయం నుండి కంప్యూటర్‌ లో బటన్‌ నొక్కి వారి ఖాతాల్లో నేరుగా ముఖ్యమంత్రి జమ చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్‌లో వారు పాల్గొన్నారు. కలెక్టర్‌ మాట్లా డుతూ పల్నాడు జిల్లాలో మెయిన్స్‌ కు వెళ్లే వాళ్లకి రూ 1 లక్ష, ఇంటర్వ్యూ కి వెళ్లే వాళ్లకి రూ .50 వేలు ఇన్సెంటివ్‌ పొందారన్నారు. పల్నాడు జిల్లా నుంచి ఐదుగురు విద్యా ర్థులు విదేశాలకు వెళ్తున్నారన్నారు. కార్యక్రమంలో పుడా చైర్మన్‌ మిట్టపల్లి రమేష్‌, ముదిరాజు కార్పొరేషన్‌ చైర్మన్‌ స్వామి మాస్టర్‌ పాల్గొన్నారు.

➡️