విద్యార్థులకు దుస్తుల పంపిణీ

ప్రజాశక్తి – జంగారెడ్డిగూడెం

స్థానిక డాంగే నగర్‌ అంబేద్కర్‌ యువజన సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులకు నూతన దుస్తులు పంపిణీ చేశారు. సోమవారం పట్టణంలోని సుబ్బంపేట ఎంపీపీ పాఠశాల, గరుడపక్షి నగర్‌ ఎంపీపీ పాఠశాల విద్యార్థులకు క్రిస్మస్‌ పండుగను పురస్కరించుకొని అందజేశారు. ఈ సందర్భంగా డాంగే నగర్‌ అంబేద్కర్‌ యువజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు అమృతల రంగా మాట్లాడుతూ సంఘ గౌరవాధ్యక్షులు నేలపోలు ప్రభాకర్‌ రావు విజ్ఞప్తి మేరకు సుబ్బంపేట ఎంపీపీ పాఠశాల విద్యార్థులకు స్థానిక ఎన్టీఆర్‌ నగర్‌ జీసస్‌ క్రిస్ట్‌ మినిస్ట్రీ పాస్టర్‌ ఎన్‌.మోజేష్‌, గరుడపక్షి నగర్‌ ఎంపీపీ పాఠశాల విద్యార్థులకు విజయవాడ బేతెల్‌ మినిస్ట్రీస్‌ పాస్టర్‌ జయకుమార్‌ బాబు ఆర్థిక సహకారంతో నూతన దుస్తులు అందించినట్లు తెలిపారు. అంబేద్కర్‌ యువజన సంఘం ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు కొనసాగించడంలో భాగస్వాములు అవుతున్న సభ్యులందరికీ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గరుడ పక్షి నగర్‌ ఎంపీపీ పాఠశాల ఉపాధ్యాయులు నాగార్జున, సుబ్బంపేట ఎంపీపీ పాఠశాల తల్లిదండ్రులు, కమిటీ ఛైర్మన్‌ నసీమ, డాంగే నగర్‌ అంబేద్కర్‌ యువజన సంఘం కార్యదర్శి పటాన్‌ బాజీ, సభ్యులు ఇమ్మంది శ్రీనివాస్‌, ఎల్‌.శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

➡️