విద్యార్థులకు పట్టుదల, కృషి ఉండాలి

విద్యార్థులకు పట్టుదల, కృషి ఉండాలి

ప్రజాశక్తి-రాజమహేంద్రవరంవిద్యార్థులు లక్షాన్ని సాధించాలంటే నిరంతర కృషి, పట్టుదల ఉండాలని తిరుమల విద్యా సంస్థల ఛైర్మన్‌ నున్న తిరుమలరావు పిలుపు ఇచ్చారు. తిరుమల క్యాంపస్‌లో బుధవారం నిర్వహించిన ఇన్‌స్పిరిట్‌-2023 ప్రొగ్రాంలో ఆయన మాట్లాడారు. జెఇఇఇ-2024కు దేశవ్యాప్తంగా 12.3 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి 68 వేల మంది విద్యార్థులు అధికంగా ధరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. ఏటా ఎంతో కాంపిటీషన్‌ ఉంటే ఈ పరీక్షల్లో తిరుమల రాజమండ్రి, విశాఖపట్నం, భీమవరం క్యాంపస్‌ల నుంచి 657 మంది విద్యార్థులు సెలక్టయ్యారని తెలిపారు. వీరిలో 447 విద్యార్థులు ఈ రోజు రావడం ఎంతో సంతోషదాయకం అన్నారు. అనంతరం విద్యార్థులకు ఆయన షీల్డులను బహూకరించారు. ఈ సందర్భంగా అకడమిక్‌ డైరెక్టర్‌ సతీష్‌ బాబు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కష్టపడి కాకుండా ఇష్టపడి చదివితే ఉన్నత శిఖరాలను అందుకోగలరని చెప్పారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్‌ సరోజినీ దేవి, ప్రిన్సిపల్‌ శ్రీహరి, విద్యార్థులు వారి తల్లిదండ్రులు, తిరుమల అధ్యాపక మరియు అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.

➡️