విద్యార్థులకు విజ్ఞానం అవసరం

ప్రజాశక్తి-సిఎస్‌ పురం: విద్యార్థులకు చదువుతోపాటు విజ్ఞానం కూడా అవసరమని నల్లమడుగుల డిపిఈపి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు షేక్‌ అహ్మద్‌ తెలిపారు. వైజ్ఞానిక విహారయాత్రలో భాగంగా గురువారం తమ పాఠశాల విద్యార్థులతో మండలంలో ప్రముఖ పర్యాటక క్షేత్రమైన భైరవకోనను సందర్శించారు. అక్కడ భైరవకోన విశిష్టత, జలపాతం గురించి విద్యార్థులకు వివరించారు. ఇలాంటి పర్యాటక క్షేత్రాల గురించి తెలుసుకోవడం వల్ల విద్యార్థుల్లో ఉత్తేజం, చైతన్యం కలుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయురాలు అనురాధ తదితరులు పాల్గొన్నారు.

➡️