విద్యార్థులకు వ్యాసరచన పోటీలు

ప్రజాశక్తి – చాపాడు జనవరి 24న నిర్వహించబోయే జాతీయ బాలిక దినోత్సవాన్ని పురస్కరించుకొని చాపాడు విద్యా వనరులలో బాలికల సంరక్షణ అమలు అంశంపై మండలంలోని హైస్కూల్‌ విద్యార్థులకు పోటీలు నిర్వహించారు. పెయింటింగ్‌లో చాపాడు హైస్కూల్‌ పదవ తరగతి విద్యార్థి బి నాగవేణి, డిబేట్‌లో కస్తూరిబా పాఠశాల విద్యార్థి కె రాజేశ్వరి, వ్యాసరచన పోటీలో కస్తూరిబా పాఠశాల విద్యార్థి జి నందిని ప్రథమ స్థానంలో గెలుపొందారు. విద్యార్థులు జనవరి 24న జిల్లా స్థాయిలో నిర్వహించే పోటీలలో పాల్గొంటారని ఎంఇఒ రవిశంకర్‌ తెలిపారు. కార్యక్రమంలో జడ్జిలుగా వి.వంశీ కష్ణ, ప్రధానోపాధ్యాయులు భాస్కర్‌రావ్‌ వ్యవహరించారు. గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఎంఆర్‌సి సిబ్బంది పాల్గొన్నారు. వేంపల్లె : పోటీ పరీక్షల్లో విద్యార్థులు రాణించినప్పుడే గుర్తింపు వస్తుందని పాఠశాల ఇన్‌ఛార్జి హెచ్‌ఎం చెరుకూరి శ్రీనువాసులు అన్నారు. శనివారం స్థానిక జిల్లా పరిషత్‌ బాలికల పాఠశాలలో ‘సేవ్‌ ది గర్ల్‌ చైల్డ్‌’ అనే అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో ప్రథమ విజేతగా 8వ తరగతికి చెందిన పూజ , ద్వితీయ విజేతగా రోషిని, తతీయ విజేతగా పావని ప్రతిభ చూపినట్లు చెప్పారు. వక్తృత్వ పోటీలలో మైనార్టీ ఉర్దూ గురుకుల పాఠశాలకు చెందిన పౌజియా మొదటి విజేతగా నిలవగా ద్వితీయ స్థానంలో బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థి ఎన్‌. జాహ్నవి, తతీయ స్థానంలో గురుకుల పాఠశాల విద్యార్థి సమీరా, చిత్రలేఖనం పోటీలలో బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రథమ, ద్వితీయ, తతీయ విజేతలుగా నీరజ, నందీశ్వరి , పూజిత ఎంపికైనట్లు చెప్పారు. మండల స్థాయిలో ప్రతిభ చూపిన విద్యార్థులు జిల్లా స్థాయిలోనూ రాణించాలని కోరారు. ప్రతిభ చూపిన విద్యార్థులను ఇన్‌ ఛార్జ్‌ హెచ్‌ఎం చెరుకూరు శ్రీనివాస్‌ అభినందించారు. ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు.

➡️