విద్యార్థులకు వ్యాసరచన పోటీలు

Jan 6,2024 21:39
ఫొటో : వ్యాసరచన పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు

ఫొటో : వ్యాసరచన పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు
విద్యార్థులకు వ్యాసరచన పోటీలు
ప్రజాశక్తి-మర్రిపాడు : మొదటి ముస్లిం ఉపాధ్యాయురాలు ఫాతిమా షేక్‌, సామాజిక వేత్త, రచయిత, ఉపాధ్యాయురాలు సావిత్రిబాయిపూలేల జయంతి సందర్భంగా ఆవాజ్‌ ఆధ్వర్యంలో కస్తూర్బా గాంధీ కళాశాలలో 8,9,10, ఇంటర్‌ విద్యార్థినులకు శనివారం వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో గెలుపొందిన విద్యార్థినులకు ప్రధమ, ద్వితీయ, తృతీయ బహుమతులను మండల అభివృద్ధి అధికారిణి నాగమణి చేతుల మీదగా సోమవారం బహుమతులు అందజేస్తామని ఆవాజ్‌ మండల కమిటీ సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షులు సయ్యద్‌ రహమతుల్లా, కార్యదర్శి సయ్యద్‌ గౌస్‌ బాషా, ప్రిన్సిపల్‌ లక్ష్మీదేవి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ఆవాజ్‌ మండల కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

➡️