విద్యుత్‌ ఉద్యోగుల క్రీడలు ప్రారంభం

విద్యుత్‌ ఉద్యోగుల క్రీడలు ప్రారంభం

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం రూరల్‌ఎపిఇపిడిసిఎల్‌ రాజమహేంద్రవరం సర్కిల్‌ విద్యుత్‌ ఉద్యోగుల 9వ ఇంటర్‌ డివిజన్‌ స్పోర్ట్స్‌ అండ్‌ గేమ్స్‌ ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో శనివారం ప్రారంభమైనట్టు సూపిరింటెండింగ్‌ ఇంజనీర్‌ టివిఎస్‌ఎన్‌.మూర్తి తెలిపారు. ఉదయం విసి ప్రొఫెసర్‌ కె.పద్మ రాజు, ఎస్‌ఇ టివిఎస్‌ఎన్‌.మూర్తి ఈ క్రీడలను ప్రారంభించారన్నారు. ఈ క్రీడా పోటీల్లో రాజమహేంద్రవరం సర్కిల్‌ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని విద్యుత్‌ ఉద్యోగులు అందరూ పాల్గొన్నట్టు చెప్పారు. రాజమహేంద్రవరం అర్బన్‌ డివిజన్‌, రాజమహేంద్రవరం రూరల్‌ డివిజన్‌, రంపచోడవరం డివిజన్‌, రామచంద్రపురం డివిజన్‌, అమలాపురం డివిజన్‌, కాకినాడ డివిజన్‌, పెద్దాపురం డివిజన్‌, జగ్గంపేట డివిజన్‌, రాజమహేంద్రవరం సర్కిల్‌ ఆఫీస్‌ ఉద్యోగులు ఈ పోటీల్లో పాల్గొంటున్నట్టు తెలిపారు.

➡️