విద్యుత్‌ పొదుపుపై అవగాహనకు కళాజాతా

విద్యుత్‌ పొదుపు

ప్రజాశక్తి- వేపగుంట : జాతీయ విద్యుత్‌ పొదుపు వారోత్సవాలలో భాగంగా ఆదివారం పెందుర్తి మండలం చింతలఅగ్రహారం గ్రామంలో ఎపిఇపిడిసిఎల్‌ మూడో జోన్‌ ఇఇ పోలాకి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో స్థానిక సర్పంచ్‌ ఎస్‌. అప్పన్నబాబు, గ్రామపెద్దలు, ప్రజల సమక్షంలో కరెంట్‌ ఆదాపై కళాజాత ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో ఎపిఇపిడిసిఎల్‌ పెందుర్తి డిఇఇ డివి.రమణమూర్తి, వేపగుంట ఎఇఇ, సిబ్బంది పాల్గొన్నారు. భవిష్యత్‌ అవసరాలను విద్యుత్‌, ఇతర ఇంధన వనరులను పొదుపు చేయాల్సిన ఆవశ్యకతపై బుర్రకథలు, గేయాలు, నృత్యాలు రూపంలో ప్రజలకు అవగాహన కల్పించారు.

బుర్రకథను ప్రదర్శిస్తున్న కళాకారులు

➡️