విద్యుత్‌ పొదుపుపై అవగాహన

విద్యుత్‌ పొదుపు వారోత్సవాల్లో

ప్రజాశక్తి -పిఎం.పాలెం : విద్యుత్‌ పొదుపు వారోత్సవాల్లో భాగంగా ఎపిఇపిడిసిఎల్‌ మూడవ జోన్‌ ఇఇ పోలాకి శ్రీనివాసరావు నేతత్వంలో డిఇఇ అనిల్‌ కుమార్‌ ఆధ్వర్యంలో జివిఎంసి ఆరో వార్డు పిఎం.పాలెం సబ్‌స్టేషన్‌ పరిధిలోని సృజన పాఠశాల విద్యార్థులకు సోమవారం విద్యుత్‌ వినియోగంలో జాగ్రత్తలు, పొదుపుపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు విద్యుత్‌ పొదుపుపై వ్యాసరచన పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎ మణి, ఉపాధ్యాయులు, విద్యుత్‌ సిబ్బంది పాల్గొన్నారు.

ఆనందపురం: స్థానిక మండల పరిషత్‌ కార్యాలయ ఆవరణలో సోమవారం విద్యుత్‌ పొదుపుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జాతీయ ఇందన పొదుపు వారోత్సవాల్లో భాగంగా మూడవ జోన్‌ మధురవాడ ఇఇ పోలాకి శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యుత్‌ ఆదాతో భావితరాలకు భరోసానివ్వాలని కోరారు. దీనిపై గ్రామాలు, పల్లెల్లోని ప్రజలు, రౖతులను, ముఖ్యంగా మహిళల్లో చైతన్యం తీసుకొచ్చే దిశగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం డ్వాక్రా మహిళలకు విద్యుత్‌ పొదుపుపై వివరించారు. కార్యక్రమంలో ఎంపిడిఒ లవరాజు, ఎడిఇ కిరణ్‌కుమార్‌, ఎఇ సురేష్‌ పాల్గొన్నారు.

మాట్లాడుతున్న ఇఇ శ్రీనివాసరావు

➡️