విద్యుత్‌ విలువైంది : జెసి

ప్రజాశక్తి -రాయచోటి విద్యుత్‌ చాలా విలువైందని, వృథా చేయకుండా కాపాడుకుందామని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌ పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఇంధన శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలకు సంబంధించిన పోస్టర్‌ను జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌ గురువారం ఉదయం తన ఛాంబర్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ ఇంధన శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల కార్యక్రమం భవిష్యత్తు తరాలకు వనరులను పరిరక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. ప్రజలకు ఇంధన పొదుపుపై అవగాహన కల్పించేం దుకు జాతీయ ఇంధన పొదుపు వారోత్స వాలను 14 డిసెంబర్‌ నుంచి 20 డిసెంబర్‌ వరకు జరుపు తున్నట్లుగా తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలందరూ ఇంధ నాన్ని పొదుపు చేయాలని పేర్కొన్నారు. విద్యుత్‌ శాఖ వారు తెలుపుతున్న చిట్కాలు పాటించి విద్యుత్‌ ఆదా చేయాలని పిలుపుని చ్చారు. ఎస్‌పిడిసిఎల్‌ ఇఇ చంద్రశేఖర్‌ రెడ్డి మాట్లాడుతూ జిల్లా ప్రజలలో విద్యుత్‌ ఆదా అవసరాన్ని, వనరుల పరిరక్షణ గురించి అవగాహన పెంపొందించేందుకు విద్యుత్‌ పరిరక్షణ వారోత్సవాలను చేపడుతున్నట్లుగా తెలిపారు. ప్రతి ఇంటిలో లైట్లు, ఫ్యాన్లు, ఎలక్ట్రిక్‌ కుక్కర్‌, ఏసీ, ఫ్రిడ్జ్‌, గీజర్‌, వంటి విద్యుత్‌ ఉపకరణాలను ఉపయోగించేటప్పుడు విద్యుత్‌ శాఖ వారు ఇచ్చిన చిట్కాలను పాటించి విద్యుత్తును ఆదా చేయడంతో పాటు విద్యుత్‌ బిల్లులను తగ్గించుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.

➡️