విలువలతో కూడిన బోధన అవసరం : ఆర్‌జెడి

ప్రజాశక్తి-చింతకొమ్మదిన్నె విద్యార్థులకు విలు వలతో కూడిన బోధన చేయాలని ఆర్‌జెడి రాఘ వరెడ్డి పేర్కొన్నారు. గురు వారం మండలంలోని భారత్‌ ఇంజి నీరింగ్‌ కళా శాలలో మండలస్థాయి క్విజ్‌ పోటీలు నిర్వహిం చారు. ముఖ్య అతిథు లుగా ఆర్‌జెడితోపాటు ఎస్‌ఎస్‌ఎ పిఒ అంబవరపు ప్రభాకర్‌రెడ్డి, డిఇఒ అనురాధ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభను పోటీ పరీక్షల ద్వారా వెలికి తీసేందుకు మండల వ్యాప్తంగా ఐదవ తరగతి విద్యార్థులకు టాలెంట్‌ టెస్ట్‌ నిర్వహించడం సంతషకరమన్నారు. విద్యా ర్థులకు చదువుతోపాటు నైతిక విలువలు పెంపొందించే దిశగా విద్యాబోధన ఉండాలన్నారు. విద్యార్థులు విద్యార్థి దశ నుంచే సేవా గుణం అలవర్చుకొని ఉన్నత స్థానానికి చేరుకోవాలన్నారు. రానున్న కాలంలో ఇలాంటి టాలెంట్‌ టెస్ట్‌ లు మండల స్థాయిలోనే కాకుండా జిల్లా స్థాయిలో మరియు జోనల్‌ స్థాయిలో నిర్వహించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. విద్యా ర్థులకు తరగతి గదిలో క్లాస్‌ సెమినార్స్‌, గ్రూప్‌ డిస్కషన్స్‌, ప్రజెంటేషన్‌ ద్వారా విద్యార్థులకు కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ పెంచాలన్నారు. విద్యార్థులకు చదువుతోపాటు సంస్కారం, జ్ఞానంతో పాటు ఆధ్యాత్మిక భక్తి భావాలు ఉండాలన్నారు. కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి వెంకటరామిరెడ్డి, ఎఎస్‌ఎ ఐఇడి కో-ఆర్డినేటర్‌ మిట్ట కేశవరెడ్డి, ఎస్‌టియు రాష్ట్ర నాయకులు బాలగంగి రెడ్డి, ఉపాధ్యాయులు కృష్ణారెడ్డి, విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

➡️