వివాహ వేడుకల్లో మంత్రి నాగార్జున

ప్రజాశక్తి -నాగులుప్పలపాడు : మండల పరిధిలోని పోతవరం గ్రామానికి చెందిన మాజీ ఎంపిపి దివి రంగవల్లి, పున్నారావు కుమారుడు వివాహ వేడుకలు బుధవారం నిర్వహించారు. ఈ వేడుకల్లో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి, వైసిపి సంతనూతలపాడు నియోజక వర్గ ఇన్‌ఛార్జి మేరుగు నాగార్జున, ఎమ్మెల్యే టిజెఆర్‌.సుధాకర్‌ పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఎఎంసి చైర్మన్‌ మారెళ్ళ బంగారుబాబు వైసిపి నాయకులు పి. శ్రీమన్నారాయణ, కోయి హనుమయ్య, గండు వెంకట్రావు పాల్గొన్నారు. అదేవిధంగా టిడిపి సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్‌ఛార్జి బిఎన్‌. విజయకుమార్‌ , మాజీ ఎంపిపి ముప్పవరపు వీరయ్య చౌదరి, టిడిపి నాయకులు వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.

➡️