వృద్ధుల బాధ్యత కుటుంబ సభ్యులదే

Jan 27,2024 21:05

ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌ :  వద్ధులను గౌరవించుకోవలసిన బాధ్యత కుటుంబ సభ్యులదేనని అడిషనల్‌ జ్యుడీషియల్‌ ఫస్ట్‌ క్లాస్‌ మెజిస్ట్రేట్‌ డి.సౌజన్య అన్నారు. శనివారం మండలంలోని నర్సిపురం పంచాయతీ కార్యాలయంలో ఐఆర్‌పిడబ్ల్యుఎ సంస్థ ఆధ్వర్యంలో వినియోగదారుల హక్కులు, వయావృద్ధుల సంక్షేమంపై న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సౌజన్య మాట్లాడుతూ పూర్వం ఉమ్మడి కుటుంబాలు ఉండేవని, ప్రస్తుతం చాలా కారణాల వల్ల ఆ అవి కనుమరుగయ్యాయని చెప్పారు. భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగ బాధ్యతల వల్ల పెద్దల పట్ల నిర్లక్ష్యం చూపిస్తున్నారనే అపవాదు వచ్చిందన్నారు. కనీసం పెద్దలను రోజుకు ఒకసారి అయినా పిల్లలు పలకరించాలని తెలిపారు. ఒకవేళ పెద్దలను పట్టించుకోకపోతే పిల్లలపై ట్రిబ్యునల్లో మెయింటెనెన్స్‌ కేసు వేయవచ్చని సూచించారు. సదస్సులో సీనియర్‌ న్యాయవాదులు జోగారావు, వెంకట్రావు, రాజేశ్వరరావు, శ్రీనివాసరావు పాల్గొన్నారు.

➡️