వెంకటేష్‌బాబుకు తోడ్పాటునందించండి

ప్రజాశక్తి-వేటపాలెం: రానున్న ఎన్నికలలో కరణం వెంకటేష్‌ బాబుని మంచి రాజకీయ నాయకుడిగా గుర్తించి తోడ్పాటు అందించాలని ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి కోరారు. మంగళవారం మండల పరిధిలోని చల్లారెడ్డిపాలెం పంచాయతీలో నూతనంగా నిర్మించిన సచివాలయాలు 1,2 రైతు భరోసా కేంద్రాలను ఆయన రిబ్బన్‌ కట్‌ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ తండ్రిగా తన విలువలు అందిపుచ్చుకున్న వెంకటేష్‌ బాబును మంచి రాజకీయ నాయకుడిగా గుర్తించి తోడ్పాటు అందించాలని కోరారు. చల్లారెడ్డిపాలెం పంచాయతీ పరిధిలో మొత్తం 5 కోట్ల 60 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులు చేసినట్లు వివరించారు. గత ఎన్నికలలో తనకు వచ్చిన 21 వేల మెజార్టీ గురించి ప్రజలకు తెలిపారు. వైసిపి ఇన్‌ఛార్జి కరణం వెంకటేష్‌ బాబు మాట్లాడుతూ భవిష్యత్తులో అబివృద్ధి పనులకు సహకరించి ఇదేవిధంగా తోడ్పాటు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తహశీల్దారు అశోక్‌ వర్ధన్‌, ఎంపీడీవో నేతాజీ, ఏవో కాశీ విశ్వనాథ్‌, అర్బన్‌ ఫైనాన్స్‌ డైరెక్టర్‌ గవిని శ్రీనివాసరావు, పార్టీ అధ్యక్షులు బొడ్డు సుబ్బారావు, సర్పంచ్‌ కందేతి రమణ, ఆర్‌బికే చైర్మన్‌ పల్లపోలు శ్రీనివాసరావు, జెసిఎస్‌ మండల ఇన్‌ఛార్జి లేళ్ల శ్రీధర్‌, గవిని వెంకట్రావు, ఆతిన వెంకట్రావు, పులి సోమయ్య, బొంతగొర్ల కోటేశ్వరరావు, గడ్డం పోలేసు, జిల్లా వ్యవసాయ సలహా మండలి సభ్యులు పులి వెంకటేశ్వర్లు, మాజీ సర్పంచ్‌ కట్టా గంగయ్య, అందే కృష్ణ, జంగిలి రామారావు, ఆవుల అశోక్‌, సీతామహాలక్ష్మి పృథ్వీ చంద్రమోహన్‌, సాదు రాఘవ, జిడుగు మస్తాన్‌, షేక్‌ ఖాదర్‌, పిన్నపురెడ్డి శ్రీనివాసరెడ్డి, కంచి సాంబిరెడ్డి, వేటగిరి సంజీవరావు, విజరు, కర్ర వెంకటేశ్వర్లు, కే బుజ్జమ్మ, తులసి మారుబోయిన పాపారావు, గవిని మురళి, పులి హరికృష్ణ, జయరాం, శ్రీరామ్‌ మూర్తి, బుద్ధి రవి, లక్ష్మయ్య, తిరుపతయ్య, జయరాములు, కష్ణారావు, నాగయ్య, ఎర్రకోటయ్య, తులసిరాం పాల్గొన్నారు.

➡️