వేతనాలు పెంచాలని రిలే దీక్ష

Mar 4,2024 21:24

ప్రజాశక్తి- గజపతినగరం : పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలని కోరుతూ గజపతినగరం, పురిటిపెంట గ్రామాలకు చెందిన పంచాయతీ కార్మికులు సోమవారం స్థానిక మెయిన్‌రోడ్డులో రిలేనిరాహారదీక్షలు చేపట్టారు. జీతాలు పెంచాలని కోరుతూ నాలుగు రోజులుగా సమ్మె చేస్తున్న కార్మికులు …అధికారులు, ఆయా సర్పంచ్‌లు స్పందించకపోవడంతో నిరాహారదీక్షలు చేపట్టారు. దీక్షలను సిఐటియు జిల్లా కార్యదర్శి వి.లక్ష్మి, బి .గోవిందా, ఎస్‌ కృష్ణ ప్రారంభించారు. రోజుకు రూ.300 కూలితో బతకడం సాధ్యం కాదని, పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలుపెంచాలని, పిఎఫ్‌, ఇఎస్‌ఐ, హెల్త్‌ అలవెన్స్‌ సౌకర్యం కల్పించాలని, దహన సంస్కరణ ఖర్చు కింద 15 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో కనకరాజు, నాగేశ్వరరావు, కృష్ణ, కోటి, ఏసు తదితరులు పాల్గొన్నారు. దీక్షలకు డివైఎఫ్‌ఐ నాయకులు నాయుడు మద్దతు తెలిపారు.

➡️