వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు ప్రణాళికలు : కలెక్టర్‌

ప్రజాశక్తి – రాయచోటి రాబోయే వేసవిని దష్టిలో ఉంచుకొని జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలలో తాగునీటికి ఇబ్బందులు లేకుండా ప్రణాళికలు రూపొందిం చాలని కలెక్టర్‌ అభిషిక్త్‌ కిషోర్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం విజయవాడ నుంచి రెవెన్యూ సేవలు, రీసర్వే మూడవ దశ, ఇనామ్‌ అండ్‌ అసైన్డ్‌ భూములు, ఎంఎస్‌ఎంఇల క్లస్టర్‌ డెవలప్మెంట్‌ ప్రోగ్రాం, నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు, పోలింగ్‌ కేంద్రాలలో కనీస సౌకర్యాలు కల్పన తదితర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. కలెక్టరేట్‌ నుంచి కలెక్టర్‌ అభిషిక్త్‌ కిషోర్‌, జెసి ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌, డిఆర్‌ఒ సత్యనారాయణ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొ న్నారు. వీడియో కాన్ఫరెన్స్‌ అనంతరం అధికారులతో కలెక్టర్‌ మాట్లా డుతూ రాబోయే వేసవి దష్టిలో ఉంచుకొని తాగునీటి ఎద్దడిని ఎదు ర్కొనేలా తగిన ప్రణాళికలు రూపొందించాలన్నారు. జగనన్న లేఅవుట్‌ కాలనీలలో ఇళ్ల నిర్మాణాల ప్రగతిపై హౌసింగ్‌ పీడితో సమీక్షించారు. గత సంవత్సరం జూన్‌, జూలైలలో అడ్వాన్స్‌ పేమెంట్లు తీసుకున్న లబ్ధిదారులతో ఇంజినీరింగ్‌ అసిస్టెంట్లు, సచివాలయ కార్యదర్శులు వాలం టీర్లు స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించి ప్రస్తుత దశ నుంచి తదుపరి దశకు ఇండ్ల నిర్మాణాన్ని తీసుకువెళ్లాలన్నారు. ఇంకను ప్రారంభం కానీ ఇళ్ళు, బిబిఎల్‌ దశలో ఉన్న వాటిని బిఎల్‌ స్థాయికి తీసుకురావాలని ఇందుకు ఇంజి నీరింగ్‌ అసిస్టెంట్లకు తగిన ఆదేశాలు జారీ చేయాలని చెప్పారు. వ్యక్తిగత మరుగుదొడ్లను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. విధులలో నిర్లక్ష్యం వహించే వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. రెవెన్యూ అంశంలో భాగంగా చుక్కల భూములు, ఇనాం భూములను మార్గదర్శకాల మేరకు పరిష్కరించాలన్నారు. కరువు ఉన్న మండలాలలో ఉపాధి హామీ పనులు ఎక్కువగా కల్పించేలా దష్టి సారించాలని డ్వామా పీడీకి సూచించారు. జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులను పటిష్టంగా నిర్వహించాలన్నారు. రీ సర్వే పూర్తయిన గ్రామాలలో హద్దురాళ్ళు నాటే లక్ష్యాలను సాధించాలన్నారు. ప్రతి పోలింగ్‌ కేంద్రంలో ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాల మేరకు కనీస సౌకర్యాలు ఉండాలని ముఖ్యంగా ర్యాంపు, మరుగుదొడ్డి తప్పనిసరిగా ఉండాలన్నారు. ప్రభుత్వ పథకాలు అమలులో లక్ష్యాలను సాధించాలని కలెక్టర్‌ పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

➡️