వైపాలెంలో కాంగ్రెస్‌ జెండాను ఎగురవేద్దాం

ప్రజాశక్తి-యర్రగొండపాలెం: యర్రగొండపాలెం నియోజకవర్గం కాంగ్రెస్‌కు ఒకప్పుడు కంచుకోటగా ఉండేది. ఈ నియోజకవర్గంలో తిరిగి కాంగ్రెస్‌ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చి జెండా ఎగురవేద్దామని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు పాలపర్తి డేవిడ్‌రాజు అన్నారు. సోమవారం యర్రగొండపాలెంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాను యర్రగొండపాలెం ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత రెండున్నరేళ్ల కాలంలో ఎంతో అభివృద్ధి చేశానని చెప్పారు. తాము ఐక్యంగా పని చేసి టిక్కెట్‌ ఎవరికి ఇచ్చినా గెలిపించుకునేందుకు కృషి చేస్తామన్నారు. ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన కాంగ్రెస్‌ నాయకులు పాలపర్తి విజేష్‌రాజు, యర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్‌ఛార్జి మెడబలిమి వెంకటేశ్వరరావు, ఏబిసి జిల్లా చైర్మన్‌ మస్తాన్‌, నాయకులు చిలకా అనిల్‌ కుమార్‌, దుగ్గెంపూడి బాలకృష్ణారెడ్డి, ప్రవీణ్‌ కుమార్‌, కొండయ్య తదితరులు పాల్గొన్నారు.

➡️