వైభవంగా బ్రహ్మోత్సవాలు ప్రారంభం

Mar 19,2024 22:09
ఫొటో : అట్టహాసంగా ప్రారంభమవుతున్న బ్రహ్మోత్సవాలు

ఫొటో : అట్టహాసంగా ప్రారంభమవుతున్న బ్రహ్మోత్సవాలు
వైభవంగా బ్రహ్మోత్సవాలు ప్రారంభం
ప్రజాశక్తి-బిట్రగుంట : బోగోలు మండలం కొండ బిట్రగుంట గ్రామంలో వెలసి ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలను ఆలయ కమిటీ చైర్మన్‌ శ్రీరామ్‌మాలాద్రి ఆధ్వర్యంలో మంగళవారం గిరిప్రదర్శన ఉత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్‌ శ్రీరామ్‌ మాల్యాద్రి మాట్లాడుతూ మార్చి 19వ తేదీ నుండి 25వ తేదీ వరకు ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను చేసిందని, ఇతర రాష్ట్రాల నుండి బ్రహ్మోత్సవాలకు భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని మొక్కుబడులు తీర్చుకునేందుకు వస్తారని తెలిపారు. భక్తుల సౌకర్యార్థం కోసం రవాణా శాఖ వారు కావలి, నెల్లూరు నుండి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారన, భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. కార్యక్రమంలో కావలి ఆర్‌డిఒ శీనానాయక్‌, కార్యనిర్వహణ అధికారి అరవ రాధాకృష్ణ, ఆలయ కమిటీ సభ్యులు, అన్ని శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

➡️