వైర్‌లెస్‌ నెట్‌వర్క్‌లపై గీతం ఎఫ్‌డిపి

గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయం

ప్రజాశక్తి- మధురవాడ: గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయం, స్కూల్‌ ఆఫ్‌ టెక్నాలజీ కంప్యూటర్‌ సైన్స్‌ విభాగం ఆధ్వర్యంలో సోమవారం వైర్‌లెస్‌ నెట్‌వర్క్‌లు, భవిష్యత్తులో నూతన సాంకేతిక పరిజ్ఞానంపై ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ (ఎఫ్‌డిపి) నిర్వహించారు. కార్యక్రమాన్ని ప్రారంభించిన గీతం స్కూల్‌ ఆఫ్‌ టెక్నాలజీ డైరక్టర్‌ ప్రొఫెసర్‌ కె.నాగేంద్ర ప్రసాద్‌ మాట్లాడుతూ, అధ్యాపకులు నిరంతర విద్యార్ధులుగా నూతన సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. 5జి సాంకేతిక పరిజ్ఞానం వంటివి అందుబాటులోకి వస్తున్న ప్రస్తుత తరుణంలో కాలానుగుణ మార్పులను లోతుగా అధ్యయనం చేయాలన్నారు. ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ డైరక్టర్‌ ప్రొఫెసర్‌ జివిఆర్‌.శర్మ, కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌ విభాగాధిపతి ప్రొఫెసర్‌ ఆర్‌.శిరీష, ప్రొఫెసర్‌ జి.వెంకటేశ్వరరావు మాట్లాడారు. కార్యక్రమ కన్వీనర్‌ డాక్టర్‌ పి.శంకరావు మాట్లాడుతూ ఐదు రోజులు పాటు జరిగే ఎఫ్‌డిపి శిక్షణ లో భాగంగా అధ్యాపకులకు 4జి, 5జి నెట్‌ వర్క్‌ల పై అవగాహన, కృత్రిమ మేధ, మిషన్‌ లెర్నింగ్‌, మెట్‌ల్యాబ్‌, లేటెక్స్‌ పరిజ్ఞానం, మొబైల్‌ వైర్‌లెస్‌ సెన్సార్‌ నెట్‌ వర్క్‌లు, ఎడ్జి కంప్యూటింగ్‌, స్మార్ట్‌ సిటీ వంటి అంశాలపై ప్రముఖ ఐఐటిలు, ఎన్‌ఐటిల నుంచి నిపుణుల హజరై శిక్షణ ఇస్తామన్నారు.

➡️