వైసిపికి ఓటు వేసి తప్పు చేశాం..!

Jan 13,2024 21:26
నారాయణకు పుష్పగుచ్చం అందజేస్తున్న దృశ్యం

నారాయణకు పుష్పగుచ్చం అందజేస్తున్న దృశ్యం
వైసిపికి ఓటు వేసి తప్పు చేశాం..!
మాజీమంత్రి నారాయణ
ప్రజాశక్తి-నెల్లూరు సిటీ:గతంలో వైసిపికి ఓటు వేసి పెద్ద తప్పు చేశాం. ఈసారి టిడిపి ఓటేసి గెలిపించి తీరుతామని ప్రజలు తెలుపుతున్నారని మాజీ మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు. బాబుష్యూరిటీ – భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా… 50, 4 డివిజన్లు…బుజ్జమ్మ రేవు, పొర్లు కట్ట, ధీనదయాల్‌ నగర్‌ తదితర ప్రాంతాల్లో శనివారం ఆయన పర్యటించారు. డివిజన్లలోని ఇంటింటికెళ్లి… టీడీపీ హయాంలోనే జరిగిన వివరిస్తూ…ఈ ఐదేళ్లలో వైసీపీ చేసిన, అరాచకాలు, దౌర్జన్యాలు అభివద్ధి శూన్యం విషయాలను ప్రజలకి తెలియజేశారు. డివిజన్‌లో పర్యటిస్తుండగా…ఓ నిరుపేద చిరు వ్యాపారి…కోరిక మేరకు…తోపుడు బండిని అందచేశారు. అదే విధంగా… సంక్రాంతి పండుగను పురస్కరించుకొని…డివిజన్లోని 200 మందికి పైగా నిరుపేదలకు దుస్తులు పంపిణీ చేశారు. దీంతో నిరుపేదలందరూ…ఆయనకి ప్రత్యేకంగా కతజ్ఞతలు తెలియజేస్తూ…సార్‌ మీకు మేము అండగా ఉంటామంటూ హామీ ఇచ్చారు.అనంతరం నారాయణ మీడియాతో మాట్లాడారు. ముందుగా నెల్లూరు ప్రజలందరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఏ డివిజన్‌ కెళ్లినా…ప్రజల స్పందన అనూహ్యంగా ఉందన్నారు. ఈ డివిజన్లలో చిన్న చిన్న పనులు చేసుకుని నిరుపేదలు జీవిస్తున్నారని తెలిపారు. డెవలప్‌ మెంట్‌ అంటేనే టీడీపీలోనే జరిగిందన్న విషయాన్ని వారే నాకు గుర్తు చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ సారి వచ్చేది మీ ప్రభుత్వమేనని చెబుతుండడం చాలా సంతోషంగా ఉందన్నారు. 2024లో వైసీపీ ప్రభుత్వానికి శాశ్వతంగా చమరగీతం పాడేస్తామని…మిమ్మల్ని ఖచ్చితంగా గెలిపించుకొని తీరుతామని అనడం సంతోషంగా ఉందన్నారు. టీడీపీ ప్రభుత్వంలో… కరెంటు బిల్లు ఒక్క సారి కూడా పెంచలేదని… వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో సార్లు చార్జీలు పెంచి నిరుపేదల మీద భారాన్ని మోపిందని ఆరోపించారు. కరెంటు చార్జీలు పెంచడంతోపాటు…పెన్షన్లు కట్‌ చేయడం, సంక్షేమ పథకాలు రద్దు చేస్తున్నారని విమర్శించారు. ఈ ప్రభుత్వంలో ఏదో ఆశించాం… ఇంకా ఎక్కువ ఆశించాం…కానీ…ఉన్నదే ఊడిపోయింది…ఇక…ఈ ప్రభుత్వాన్ని గద్దె దించడమే మా లక్ష్యమని ప్రజలు ఎంతో ఆవేదనతో చెబుతుండడం బాధాకరమన్నారు. ప్రభుత్వాలు అంటేనే… ప్రజల అభివద్ధిని, సంక్షేమాన్ని చూడాలన్నారు. కానీ… ఈ ప్రభుత్వం వచ్చాక…రాష్ట్రంలో అభివద్ధి శూన్యమని తెలిపారు. దీని కారణంగా…యువతకు ఉద్యోగాలు రావని…ప్రజల ఆర్ధిక పరిస్థితి పెరగదన్నారు. 2014 నుంచి 2019 వరకు నెల్లూరు నగరంలో ఎన్నో అభివద్ధి కార్యక్రమాలు చేశామని గుర్తు చేశారు. దీంతో… ప్రజల ఆస్తి రెండు, మూడు రెట్లు పెరిగిందన్నారు. 2019 నుంచి 2024 వరకు అసలు అభివద్ధి అన్న మాటే లేదన్నారు. 2024లో ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని. .పెండింగ్‌లో ఉన్న పనులన్నింటిని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. సంగం బ్యారేజీ నుంచి రూ. 550 కోట్లతో వాటర్‌ లైన్‌ వేయించామన్నారు. కానీ ఎలక్షన్‌ కోడ్‌ రావడంతో…చివరిలో ఆ ప్రాజెక్టు ఆగిపోయిందన్నారు. వైసీపీ ప్రభుత్వం దానిని విస్మరించిం దన్నారు. అందువల్లే సుమారు పది డివిజన్లో బురద నీళ్లు వస్తున్నాయన్నారు. అధికారంలోకి రాగానే…ఫస్ట్‌ ఈ ప్రాజెక్టే నే పూర్తి చేసి… ప్రజలందరికి స్వచ్ఛమైన నీరు అందిస్తామని హామీ ఇచ్చారు.

➡️