వైసిపితోనే అన్ని వర్గాలకు న్యాయం

ప్రజాశక్తి-దర్శి : వైసిపి అన్ని వర్గాలకు సమ న్యాయం జరుగుతుందని దర్శి మాజీ ఎమ్మెల్యే, వైసిపి దర్శి నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్‌ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి తెలిపారు. దర్శిలోని హ్యాపీ హోమ్స్‌లో ఇంటింటికీ శివనన్న కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి సంక్షేమం, అభివద్ధికి పెద్దపీట వేసినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ, వైసిపి మండల అధ్యక్షుడు వెన్నపూస వెంకట్‌రెడ్డి, కార్పొరేషన్‌ డైరెక్టర్లు కుమ్మితంజిరెడ్డి, తిరుపతిరెడ్డి, ఎస్‌ఎం.బాషా, వైసిపి పట్టణ అధ్యక్షుడు కట్టికోటి హరీష్‌, నాయకులు నారాయణరెడ్డి, శేఖర్‌, పుల్లారెడ్డి పాల్గొన్నారు.

➡️