వైసిపితోనే పేదల అభ్యున్నతి :ఎమ్మెల్యే

Mar 12,2024 21:42

ప్రజాశక్తి – పార్వతీపురం టౌన్‌ : రాష్ట్రంలోని పేద, బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతి వైసిపితోనే సాధ్యమని స్థానిక ఎమ్మెల్యే అలజంగి జోగారావు అన్నారు. వైసిసి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళవారం నియోజకవర్గ పరిధిలో గల మూడు మండలాల పార్టీ అధ్యక్షులు, ప్రజా ప్రతినిధులు పార్టీ శ్రేణులతో కలిసి పార్టీ కార్యాలయం వద్ద వైసిపి జెండాను ఆవిష్కరించి, కేక్‌ ను కట్‌ చేసి ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకున్నారు. అనంతరం పార్టీ శ్రేణులతో కలిసి వైయస్‌ఆర్‌ విగ్రహం వద్దకు పాదయాత్రగా వెళ్లి వైఎస్‌ఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు కొండపల్లి బాలకృష్ణ, మండల పార్టీ అధ్యక్షులు బొమ్మి రమేష్‌, పాలవలస మురళీకృష్ణ, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బోను గౌరీశ్వరి, వైస్‌ చైర్మన్‌లు కొండపల్లి రుక్మిణి, యిండుపూరు గున్నేశ్వరరావు, జెడ్పీటీసీ సభ్యులు బలగ రెవతమ్మ, మామిడి బాబ్జీ, అలజంగి రవికుమార్‌, ఎంపీపీలు మజ్జి శోభారాణి, బలగ రమణమ్మ, గుడివాడ నాగమణి, ఎఏంసి ఛైర్‌పర్సన్‌, వైస్‌ చైర్మన్‌, పలువురు వైసిపి నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, కౌన్సిలర్లు, స్టేట్‌ డైరెక్టర్లు, ఎఎంసి డైరెక్టర్లు, సచివాలయం కన్వీనర్లు, గృహ సారథులు, కార్యకర్తలు పాల్గొన్నారు.సాలూరు: వైసిపి 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళవారం డిప్యూటీ సీఎం రాజన్నదొర నివాసంలో తొలుత పార్టీ జెండా ఆవిష్కరించారు. అనంతరం బోసు బొమ్మ జంక్షన్‌లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. తర్వాత పార్టీ బర్త్‌ డే కేక్‌ కట్‌ చేసి నాయకులు, కార్యకర్తలకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పువ్వుల ఈశ్వరమ్మ, వైస్‌ చైర్మన్లు జర్జాపు దీప్తి, వంగపండు అప్పలనాయుడు, జెసిఎస్‌ కన్వీనర్‌ గిరిరఘు, కౌన్సిలర్లు గొర్లి వెంకటరమణ రాపాక మాధవరావు, వైసిపి జిల్లా ప్రధాన కార్యదర్శి జర్జాపు సూరిబాబు పాల్గొన్నారు.సీతంపేట: వైసిపి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వైసిపి జెండాను ఎమ్మెల్యే వి.కళావతి ఎగువేశారు. అనంతరం వైఎస్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ఎంపిపి బిడ్డిక ఆదినారాయణ, జడ్పిటిసి సవర ఆదిలక్ష్మి, ప్రతినిధి సవర రాము, ఎఎంసి చైర్మన్‌ హిమరక మోహన్‌రావు, వివిధ హౌదాల్లో ఉన్న ముఖ్య నాయకులు, పార్టీ సీనియర్‌ నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.పాలకొండ : స్థానిక నగర పంచాయతీ పరిధిలోని వైఎస్‌ఆర్‌ జంక్షన్‌ వద్ద మంగళవారం వైసిపి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విప్‌ విక్రాంత్‌ పాల్గొని వైయస్సార్‌ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వైఎస్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో చైర్మన్‌ యందవ రాధాకుమారి, వైస్‌ ఛైర్మన్లు రౌతు హనుమంతరావు, పల్లా ప్రతాప్‌, పట్టణ వైసీపీ అధ్యక్షులు వెలమల మన్మధ రావు, ఎంపీపీ బొమ్మాలి భాను, వైస్‌ ఎంపీపీలు సూర్యప్రకాష్‌, అనిల్‌, నగర పంచాయతీ కౌన్సిలర్లు, నగర పంచాయతీ పరిధిలోని నాయకులు, మండలంలోని సర్పంచులు, ఎంపిటిసి సభ్యులు, వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.వీరఘట్టం: మండలం కత్తులకవిటిలో జడ్పిటిసి జంపు కన్నతల్లి ఆధ్వర్యంలో వైసిపి ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్మోహన్‌ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలంటే నినాదాలు చేశారు. అనంతరం జడ్పిటిసి జంపు కన్నతల్లి మాట్లాడుతూ గీతాంజలి మరణానికి కారకు రాలైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ గేదెల సరోజిని, ఎంపిటిసి కొత్తకోట పరిమిల, వార్డు మెంబర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.

➡️