వైసిపిని సాగనంపేందుకు ప్రజలంతా సిద్ధం

ప్రజాశక్తి – భోగాపురం:  వైసిపి ప్రభుత్వాన్నిసాగనంపేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని టిడిపి నెల్లిమర్ల నియోజకవర్గం ఇంచార్జి కర్రోతు బంగార్రాజు అన్నారు. టిడిపి మినీ మేనిఫెస్టోపై బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని గురువారం మండలంలోని తూడేం గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరిగి భవిష్యత్‌ గ్యారెంటీ బాండ్లు పంపిణి చేశారు. అనంతరం ప్రజావేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు కర్రోతు సత్యనారాయణ, క్లస్టర్‌ ఇంఛార్జి దాసరి అప్పలస్వామి, పార్లమెంట్‌ తెలుగుయువత కార్యనిర్వహణ కార్యదర్శి కర్రోతు రాజు, యూనిట్‌ ఇంఛార్జి కొండపు ఈశ్వరరావు, గ్రామ టిడిపి అధ్యక్షులు రీసు రమణ, టిడిపి నాయకులు పూడి రమణ, బూత్‌ ఇంఛార్జ్‌లు తదితరులు పాల్గొన్నారు. శృంగవరపుకోట: పట్టణంలోని శ్రీనివాస కాలనీలో టిడిపి మండల అధ్యక్షుడు జిఎస్‌.నాయుడు ఆధ్వర్యంలో బూత్‌ కన్వీనర్‌ గుడుపు బ్రహ్మజీ, పెదగాడ లక్ష్మి, యూనిట్‌ ఇంఛార్జ్‌ సరిపల్లి రామకృష్ణ సారథ్యంలో గురువారం బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి రిజిస్ట్రేషన్‌ చేస్తూ కరపత్రాలను పంపణీ చేశారు. అనంతరం ప్రజలకు మినీ మేనిఫెస్టో పథకాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్‌ ఇంఛార్జ్‌ అండ్‌ విశాఖ టిడిపి పార్లమెంటరీ కార్యనిర్వాహక కార్యదర్శి కాపుగంటి శ్రీనివాసు, వార్డు మెంబెర్‌ గుడుపు నాగమణి, తదితరులు పాల్గొన్నారు.

➡️