వైసిపి పాలనలో రాజ్యాంగ విలువలకు తిలోదకాలు

Feb 20,2024 21:48

ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌: వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగ విలువలు నానాటికి దిగజారిపోతున్నాయని పార్వతీపురం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి బోనెల విజయచంద్ర అన్నారు. అనంతపురం జిల్లా రాప్తాడులో జరిగిన సిద్ధం సభలో పత్రికా విలేకరిపై జరిగిన భౌతిక దాడిని తీవ్రంగా ఖండిస్తూ, రాష్ట్రంలో రాజ్యాంగాన్ని కాపాడాలని మంగళవారం కొత్తవలసలో జరిగిన ఒక కార్యక్రమంలో అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి వినతి అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసిపి వారికి రాజ్యాంగ సంస్థలైన కోర్టులు, పోలీసులు, పత్రికా విలేకరులు ప్రజల నుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధులు అంటే లెక్కలేనితనాన్ని ప్రదర్శన చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎండగడితే భౌతిక దాడులకు పాల్పడుతున్నారన్నారు. వీరి ప్రవర్తనను ఐదేళ్లుగా గమనిస్తున్న ప్రజలు రాబోతున్న రెండు నెలల్లో సరైన తీర్పు ఇచ్చి బుద్ధి చెబుతారని అన్నారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు జి.రవికుమార్‌, కౌన్సిలర్లు కోరాడ నారాయణరావు, కోలా సరితా మధు, బడే గౌరినాయుడు, నాయకులు బార్నాల సీతారాం, గొట్టాపు వెంకటనాయుడు, కార్యకర్తలు పాల్గొన్నారు.కురుపాంఅనంతపురం జిల్లా రాప్తాడులో ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి సిద్ధం సభలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్‌పై జరిగిన దాడి అన్యాయమని కురుపాం ప్రెస్‌క్లబ్‌ గౌరవాధ్యక్షులు నెల్లి శ్రీనివాస్‌ అన్నారు. మంగళవారం స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం వద్ద కురుపాం ప్రింట్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌ మీడియా విలేకరులు ఎన్నికల ఉప తహశీల్దార్‌ జి.చంద్రశేఖర్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన విధులు, బాధ్యతలు నిర్వహిస్తున్న విలేకరిపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ప్రింట్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌ మీడియా ప్రతినిధులు కె.మౌళి, జి.ఢిల్లీశ్వరరావు, ఎస్‌.వరప్రసాద్‌, పి.సంతు, వి.శేషు, ఎస్‌.సోమేశ్‌, పి.నాగరాజు, బి.అనిల్‌, మణికంఠ తదితరులు పాల్గొన్నారు.వైసిపి ప్రభుత్వంలో శాంతి భద్రతల కరువయ్యాయి : టిడిపివైసిపి ప్రభుత్వ హయాంలో బడుగు, బలహీన వర్గాల ప్రజలకు, పాత్రికేయులకు పూర్తిగా శాంత భద్రతల కరవయ్యావని టిడిపి అరుకు పార్లమెంట్‌ ఎస్టీ సెల్‌ అధికార ప్రతినిధి ఎన్‌.కృష్ణబాబు అన్నారు. మంగళవారం స్థానిక టిడిపి కార్యాలయంలో పత్రిక విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం ఏర్పడ్డాక పూర్తిగా శాంతి భద్రతల కరువై సామాన్యులపై దాడులు పెరిగాయని, మొన్నటికి మొన్న రాప్తాడు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి సభలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్‌పై దాడి చాలా దారుణమని అన్నారు. రానున్న ఎన్నికల్లో ఈ ప్రభుత్వాన్ని గద్ది దించి తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. కార్యక్రమంలో మండల టిడిపి కన్వీనర్‌ కెవి కొండయ్య, నాయకులు కలిశెట్టి శ్రీనివాసరావు, బోటు గౌరి, కొట్టు రవణ, మహేష్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️