‘వైసిపి సానుభూతిపరుల ఓట్లు తొలగించే కుట్ర’

పొన్నూరు రూరల్‌: పొన్నూరు నియోజకవర్గంలో ధూళిపాళ్ళ నరేంద్ర, వైసిపి సానుభూతిపరుల ఓట్లు తొల గించుటకు కుట్రలు చేస్తున్నాడని, వారి అనుచరులచే ఇష్టారీతిగా భారీగా ఫారం 7 దరఖాస్తులను పెట్టిస్తున్నాడని సోమవారం జరిగిన స్పందన కార్యక్రమంలో వైసిపి నాయ కులు ఫిర్యాదు చేశారు. వైసిపి ఓట్లు తొలగింపులో మన్నవలోనే సుమారు 129 ఫారం 7 దరఖాస్తులు పెట్టారని, నరేంద్ర ప్రధాన అనుచరుడు టిడిపి మం డల పార్టీ అధ్య క్షుడు బండ్లమూడి బాబూరావు ఆయన కుటుం బ సభ్యులు మాత్రమే ఈ ఫారం 7 దర ఖాస్తులను పెట్టడం చూస్తే, నరేంద్ర ఏ విధంగా అక్రమాలకు పాల్పడుతున్నాడో అర్థమౌతుందని అన్నారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఒక్కొక్కరు 5కు మించి,పరిధి దాటి ఇష్టారీతిగా 40 నుంచి 50 వరకు ఫారం 7 దరఖాస్తులను పెట్టినవారిపై చట్టప రంగా చర్యలు తీసుకోవాలని అన్నారు.

➡️