శాస్త్రీయ దృక్పథంతోనే సమాజ అభివృద్ధి : జెవివి

Feb 6,2024 21:07

ప్రజాశక్తి – పాలకొండ : శాస్త్రీయ దృక్పథాన్ని ప్రజలకు అవగాహన కల్పించి, సమాజ అభివృద్ధికి కృషి చేయాలని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి గొంటి గిరిధర్‌ పిలుపునిచ్చారు. శాస్త్రీయ దక్పధ కాంపైన్‌లో భాగంగా జెవివి జిల్లా అధ్యక్షులు కొండపల్లి గౌరునాయుడు అధ్యక్షతన రాష్ట్ర స్థాయి సైన్స్‌ కళా జాతా స్థానిక వివేకానంద హై స్కూల్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిధర్‌ మాట్లాడుతూ సైన్స్‌ కళా జాతా ద్వారా ప్రజానీకాన్ని మూఢనమ్మకాల నిర్మూలన పట్ల చైతన్యం చేస్తున్నట్టు తెలిపారు. పాఠశాల ప్రధానోపాధ్యా యులు పారి నాయుడు మాట్లాడుతూ సైన్స్‌ కళా జాతా ద్వారా ప్రజానీకాన్ని జెవివి చైతన్యవంతం చేయడాన్ని అభినందించారు. జెవివి జిల్లా గౌరవ అధ్యక్షులు బివి రమణ శాస్త్రీయ దృక్పథాన్ని పెంచేందుకు జెవివి కృషిని కొనియాడారు. జెవివి జిల్లా ప్రధాన కార్యదర్శి సార్తి మహేశ్వరరావు సైన్స్‌ కళా జాతా విశిష్టతను తెలియజేస్తూ మూఢ నమ్మకాలను సమాజం నుంచి దూరం చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా ఉపాధ్యక్షులు బిఎం గౌరీశ్వరరావు నమ్మకానికి-మూఢనమ్మకానికి మధ్య వ్యత్యాసాన్ని పాట రూపంలో వివరించారు. సమతా కన్వీనర్‌ శశిరేఖ శాస్త్రీయ సమాజ ఆవశ్యకతను వివరించారు. కార్యక్రమంలో సైన్స్‌ నృత్య రూపకాలు, సైన్స్‌ నాటికలు, సైన్స్‌ గీతాలాపన, సైన్స్‌ మ్యాజిక్‌ ప్రదర్శించారు. కార్యక్రమంలో శాస్త్రీయ దక్పథం కరపత్రాన్ని అతిథులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో జెవివి జిల్లా నాయకులు రామారావు, చిన్నారావ,ు ఫకీరు స్వామి, పుష్పనాథం, రామకృష్ణ, బాబు, గణేష్‌, నాగేశ్వరరావు, రాజకుమారి, సతీష్‌, పలు పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

➡️