శాస్త్ర సాంకేతిక విద్యను అందిపుచ్చుకోవాలి

ప్రజాశక్తి -కనిగిరి : విద్యార్థులు సాంకేతిక విద్యను అందిపుచ్చుకోవాలని ఎంఇఒ ఉడుముల నారాయణరెడ్డి తెలిపారు. స్థానిక ఎంహెచ్‌ఆర్‌ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఆధునిక సైన్స్‌ ల్యాబ్‌ను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంఇఒ మాట్లాడుతూ విద్యార్థులు పోటీ తత్వాన్ని అలవర్చుకొని చక్కగా చదివి మంచి ఫలితాలు సాధించాలన్నారు. పాఠశాల ప్రిన్సిపల్‌ హనుమంతరావు మాట్లాడుతూ విద్యార్థులలో మేధశక్తిని పెంపొందించేందుకు అత్యాధునిక సైన్స్‌ ల్యాబ్‌ను అందు బాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. అనంతరం ఎంఇఒ నారాయణరెడ్డిని ప్రిన్సిపల్‌ హనుమంతరావు, కరస్పాండెంట్‌ వరుణ్‌ కుమార్‌ సత్కరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

➡️