శ్రీవారి మొక్కు తీర్చుకున్న చంద్రబాబు

Dec 1,2023 21:56
తిరుమల శ్రీవారి సేవలో చంద్రబాబు దంపతులు

శ్రీవారి మొక్కు తీర్చుకున్న చంద్రబాబుప్రజాశక్తి – తిరుమలతెలుగు జాతి ప్రపంచలో నెం. 1 గా ఉండాలని, ఆ సంకల్పంతో పని చేస్తానని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. శుక్రవారం ఉదయం శ్రీవారిని చంద్రబాబు నాయుడు దంపతులు దర్శించుకున్నారు. గర్భాలయంలో స్వామివారి మూలవిరాట్టును దర్శించి, హుండీలు కానుకలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు శేషవస్త్రం కప్పి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత పుట్టి అంచెలంచెలుగా ఎదిగి ప్రజా సేవకు అంకితమయ్యానని, వెంకటేశ్వర స్వామి తమ ఇంటి దైవమని, ఏ పనైనా ఆయన్ను తలచుకునే ప్రారంభిస్తానని అన్నారు. 2003 శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో అలిపిరి వద్ద తనకు ప్రమాదం జరిగినపుడు తనకు ఆ వెంకటేశ్వర స్వామి ప్రాణ భిక్ష పెట్టారన్నారు. తాజాగా తనకు కష్టం వచ్చినపుడూ వెంకటేశ్వరస్వామిని మొక్కుకున్నానని, మొదటగా ఆయన దర్శనం చేసుకున్న తర్వాతే మిగతా కార్యక్రమాలు చేపట్టాలని అనుకున్నానన్నారు. కష్ట సమయంలో తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ఆయనతో పాటు మాజీ మంత్రులు పనబాక లక్ష్మి, అమరనాథరెడ్డి, తిరుపతి మాజీ ఎంఎల్‌ఎ సుగుణమ్మ తదితరులు ఉన్నారు. తిరుమల శ్రీవారి సేవలో చంద్రబాబు దంపతులు

➡️