షరా ‘మామ్మూళ్లే’

Feb 4,2024 20:44

ప్రజాశక్తి- బొబ్బిలి : బొబ్బిలి, రామభద్రపురం మండ లాలు నుంచి కలపను అక్రమంగా తరలిస్తు న్నారు. అటవీశాఖ అనుమతులు తీసుకుని చెట్లు కొట్టి తరలించాల్సి ఉన్నప్పటికీ కలప వ్యాపారులు ఎటువంటి అనుమతులూ తీసుకోకుండా చెట్లు కొట్టి కలపను అక్రమ ంగా తరలిస్తున్నారు. అక్రమ కలప రవా ణాను అడ్డుకోవాల్సిన అటవీశాఖ అధికారులు మామూళ్లు మత్తులో ఉన్నారని విమర్శలు వస్తున్నాయి. బొబ్బిలి, రామభద్రపురం మండలాల్లో గ్రామీణ ప్రాంతాల నుంచి వందలాది లోడ్లు కలపను కొంత మంది గజపతినగరం తరలించి సొమ్ము చేసుకుంటు న్నారు. గతనెల 29న రామభద్రపురం మండలం గొల్లలపేట నుంచి ఎటువంటి అనుమతులూ లేకుండా రెండు ట్రాక్టర్లతో టేకు, పాచి కలపను తరలిస్తుండగా అటవీ శాఖ అధికారులకు గుర్తు తెలియని వ్యక్తులు ఫిిర్యాదు చేయడంతో అటవీశాఖ అధికారులు పట్టుకుని కేసు నమోదు చేశారు. రెండు ట్రాక్టర్లపై కేసు నమోదు చేసి వారం రోజులు గడవక ముందే బొబ్బిలి ప్రాంతం నుంచి కలపను మళ్లీ పట్టపగలు తరలిస్తున్నా రంటే అక్రమ కలప తరలింపునకు అటవీశాఖ అధికారులు సహకారం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చును. పట్టపగలే కలప తరలింపుకలప వ్యాపా రులు అటవీశాఖ అధికారులతో ఒప్పందం కుదుర్చుకుని అనుమతులు తీసుకోకుండా బొబ్బిలి, రామభద్రపురం ప్రాంతాల నుంచి పట్టపగలే చెట్లును కొట్టి కలపను అక్రమంగా తరలిస్తున్నారు. రైతుల నుంచి తక్కువ ధరకు చెట్లును కొనుగోలు చేసి అటవీశాఖ అనుమతులు తీసుకో కుండా చెట్లు కొట్టి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతు న్నారు. గిరిజన ప్రాంతాల్లో ప్రభుత్వ భూములలో ఉన్న చెట్లును అక్రమంగా కొట్టి తరలిస్తున్నట్లు ఆరో పణలు వస్తున్నాయి. డొంగురువలస గిరిజన ప్రాంతం నుంచి ట్రాక్ట ర్‌తో అక్రమంగా కలప తరలించడం ప్రజాశక్తి కంట పడింది. గిరిజన ప్రాంతం నుంచి శనివారం సాయంత్రం 5గంటల సమయంలో ఒక ట్రాక్టర్‌తో కలపను అక్రమంగా తరలిస్తున్నారంటే కలప అక్రమ రవాణా ఎలా జరుగుతుందో అర్థం చేసుకోవచ్చునని ప్రజలు చర్చించుకుంటున్నారు.ఫిర్యాదులు వస్తేనే కేసులుఅక్రమ కలప తరలింపుపై ఫిర్యాదులు వస్తేనే అటవీశాఖ అధికారులు కేసులు నమోదు చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఫిర్యాదులు రాకపోతే అక్రమ కలప తరలింపుపై ఎటువంటి చర్యలు తీసుకునే దాఖలాలు లేవు. అటవీ ప్రాంతాల్లో కూడా చెట్టులను అక్రమంగా కొడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. పెరుగుతున్న కాలుష్యాన్ని నివరించాలంటే మొక్కలు నాటాలని ప్రభుత్వం ఏటా ప్రత్యేక కార్యక్రమం చేపడుతోంది. పర్యావరణ పరిరక్షణకు పచ్చదనాన్ని కాపాడాల్సి ఉన్నప్పటికీ ఆ దిశగా ప్రభుత్వ అధికారులు పని చేయడం లేదు. పర్యావరణ పరిరక్షణకు అక్రమ కలప రవాణాను అడ్డుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

➡️