షేర్ల జారీ పేరున భారీ మోసం

Feb 23,2024 21:24

ప్రజాశక్తి- శృంగవరపుకోట : జిందాల్‌ భూసేకరణలో షేర్ల జారీ పేరున భారీ మోసం జరిగిందని జిందాల్‌ నిర్వాసిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం 4వ రోజు నిరసన దీక్ష కొనసాగించారు. ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ మండలంలోని జిందాల్‌ అల్యూమినా కర్మాగారం వస్తుందని, ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, చుట్టు పక్కల గ్రామాల ప్రజలకు ఉపాధి కలుగుతుందనే ఆలోచనతో భూముల్ని జిందాల్‌కు అప్పగించా మన్నారు. ఇందులో భాగంగా షేర్ల రూపేణా ధృవపత్రాలు యాజమాన్యం అప్పట్లో ఇచ్చిందని అవి ఇంగ్లీష్‌లో ఉండటం వల్ల చదువురాని కారణంగా తమకు అప్పట్లో కంపెనీ యాజమాన్యం ఇచ్చిన షేర్ల ధృవీకరణ పత్రాలు సరిచూసుకోలేదని చెప్పారు. వాటిమీద పరిహారానికి బదులుగా బహుమానం అని పేర్కొని ఉందని, ఇది భారీ మోసమని జిందాల్‌ నిర్వాసిత రైతులు పేర్కొ న్నారు. జిందాల్‌ అల్యూమినా కర్మాగారం వస్తుందనే ఉద్ధేశ్యంతోనే తామంతా భూములు ఇచ్చామని, ఇప్పుడు ఎంఎస్‌ఎంఇ పార్కు పేరిట జిందాల్‌ యాజ మాన్యం వ్యాపారధోరణితో వ్యవహరించి తమ భూములను వేరే వాళ్లకు కట్టబెట్టడం తమకు సమ్మతం కాదని చెప్పారు. ప్రభుత్వం వెంటనే స్పంది ంచి జిందాల్‌ కంపెనీ నిర్మాణానికి భూములు ఇచ్చిన నిర్వాసిత రైతుల విషయంలో భూసేకరణ చట్టం-2013 అమలు చేసి తమకు సత్వర న్యాయం చేయా లని కోరారు.

➡️