సంక్షేమం పేరుతో సంక్షోభ పాలన : ఉగ్ర 

ప్రజాశక్తి- కనిగిరి :   కనిగిరి మున్సిపాలిటీ పరిధిలోని పాతూరు, మంగళ మాన్యంలో మన ఊరు -మన ఉగ్ర, బాబు ష్యూరిటీ, భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా  మాజీ ఎమ్మెల్యే, టిడిపి ఇన్‌ఛార్జి డాక్టర్‌ ఉగ్ర నరసింహారెడ్డి ఇంటింటికీ తిరిగి టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వస్తే అమలు చేసే పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు అందజేశారు. అనంతరం డాక్టర్‌ ఉగ్ర మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం సంక్షేమం పేరుతో సంక్షోభ పాలనను సాగిసుందన్నారు.  ప్రజల గోడు పట్టని వైసిపి ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాలన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షుడు నంబుల వెంకటేశ్వర్లు, టిడిపి నాయకులు వివిఆర్‌.మనోహర్రావు, షేక్‌ ఫిరోజ్‌, తమ్మినేని వెంకటరెడ్డి, షేక్‌ అహ్మద్‌, బుల్లా బాలబాబు, పచ్చవ చంద్రశేఖర్‌, చింతలపూడి తిరుపాలు, ఆర్‌వి.నారాయణ, పాలూరు సత్యం, ఈదర రవికుమార్‌ పాల్గొన్నారు పొదిలి : వైసిపి అరాచక పాలనకు చరమగీతం పాడాలని మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి తెలిపారు. పొదిలి పట్టణంలోని విశ్వనాధపురం 7,8 వార్డుల్లో బాబు ష్యూరిటీ, భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమం మంగళ వారం నిర్వహించారు. ఈ సందర్భంగా కందుల ఇంటింటికీ తిరిగి టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వస్తే అమలు చేసే పథకాల గురించి ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్‌పిటిసి కాటూరి వెంకటనారాయణ రావు, టిడిపి నాయకులు మిగడ ఓబుల్‌ రెడ్డి, ముల్లా ఖుర్దూస్‌, యర్రం రెడ్డి వెంకటేశ్వర రెడ్డి, న్యాయవాది ఎస్‌ఎం.బాషా, మాజీ సర్పంచి స్వర్ణ గీత, నాయకులు ఎస్‌కె.రసూల్‌, శామంతపూడి నాగేశ్వరరావు, తాతిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి, జ్యోతి మల్లికార్జున పాల్గొన్నారు.

➡️