సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలి

సంక్షేమ బోర్డు

ప్రజాశక్తి – పెద్దాపురంభవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును వెంటనే పునరుద్ధరించాలని ఎపి బిల్డింగ్‌ వర్కర్స్‌ అండ్‌ అదర్‌ కన్స్ట్రక్షన్‌ వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో గురువారం ఆర్‌డిఒ జె.సీతారామారావుకు వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ సంక్షేమ బోర్డును నిలుపుదల చేసి నాలుగేళ్లయిందన్నారు. దీంతో సంక్షేమ బోర్డు నుంచి భవన నిర్మాణ కార్మికులకు అందే అన్ని సంక్షేమ పథకాల ఫలాలు ఆగిపోయాయన్నారు. భవన నిర్మాణ రంగంలోని అన్ని విభాగాల కార్మికులకు దక్కాల్సిన సంక్షేమ ఫలాల నిధులు ఇతర కార్యకలాపాలకు మళ్లించడం దారుణమన్నారు. ప్రజా సంక్షేమమే తన లక్ష్యం అని చెప్పే ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ప్రజలపై ఏమాత్రం గౌరవమున్నా సంక్షేమ బోర్డును నిలుపుదల చేస్తూ ఇచ్చిన సర్కులర్‌ను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో గడిగట్ల సత్తిబాబు, చింతల సత్యనారా యణ, తైనాల శ్రీను, వడ్డి సత్యనారాయణ, తాడిశెట్టి గంగ, గూనూరి వెంకటరమణ, ఎన్‌.సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.

➡️