సంక్షేమ బోర్డు ద్వారా పథకాలు అమలుచేయాలి

భవన నిర్మాణ కార్మికుల నిరసన

సిఐటియు ఆధ్వర్యాన భవన నిర్మాణ కార్మికుల నిరసన

ప్రజాశక్తి -ములగాడ : వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత రద్దు చేసిన సంక్షేమ బోర్డును పునరుద్ధరించి, దాని ద్వారా భవన నిర్మాణ కార్మికులకు పథకాలను అమలు చేయాలని భవన నిర్మాణ సంఘం (సిఐటియు) ఆధ్వర్యంలో బుధవారం నిరసన చేపట్టారు. పారిశ్రామిక ప్రాంతం 62వ వార్డు త్రినాధపురం, 63వ వార్డు క్రాంతినగర్‌, చింతల్లోవ ప్రాంతాల్లో భవన నిర్మాణ కార్మికులు ఆందోళన చేపట్టారు.ఈ సందర్భంగా భవన నిర్మాణ సంఘం గౌరవాధ్యక్షులు కె. పెంటారావు, మల్కాపురం జోన్‌ ప్రధాన కార్యదర్శి ఎం.ఆదినారాయణ మాట్లాడుతూ, వైసిపిప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకు తీవ్ర అన్యాయం చేసిందని మండిపడ్డారు సంక్షేమ బోర్డు రద్దుచేసి, నిధులన్నీ దారి మళ్లించి, భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలను దూరం చేసిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి చర్యలు చేపట్టకుంటే వచ్చే ఎన్నికల్లో గుణపాఠం చెప్పక తప్పదని హెచ్చరించారు. నిరసనలో సంఘం నాయుకులు డి.గోపాల్‌, మురళీ, పి.సురేష్‌, నీలయ్య, ఆనందరావు, హరి, రాజు, త్రినాధపురంలో పి.రామారావు, కె.సింహచలం, మడ్డు గణేష్‌, అప్పయ్య పాల్గొన్నారు.

మాట్లాడుతున్న పెంటారావు

➡️