సందడిగా ‘గీతం ‘ అంతర్జాతీయ యువజనోత్సవం

'గీతం ' అంతర్జాతీయ యువజనోత్సవం

ప్రజాశక్తి- మధురవాడ : గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ విద్యార్ధుల యువజనోత్సవం ‘సంయుక్త-24’ గురువారం సందడిగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా గీతం అంతర్జాతీయ విద్యార్ధి వ్యవహరాల విభాగం డైరక్టర్‌ డాక్టర్‌ కె.పి.కిషన్‌ మాట్లాడుతూ, ఈ నెల 16న శుక్రవారం యువజనోత్సవంలో భాగంగా క్రీడా పోటీలతో పాటు సంగీత, కృత్య కార్యక్రమాలు, విదేశీ వంటకాలతో ఫుడ్‌ఫెస్టివల్‌ నిర్వహించనున్నట్లు తెలిపారు. సంయుక్త యువజనోత్సవం ద్వారా విద్యార్ధులు తమ ప్రతిభ పాటవాలను ప్రదర్శించే అవకాశం లభిస్తుందన్నారు. రాష్ట్రంలోని వివిధ విద్యాసంస్థల నుంచి 150 మంది విదేశీ విద్యార్ధులు ఉత్సవాల్లో పాల్గొంటారన్నారు. యువజనోత్సవంలో భాగంగా గీతం ప్రాంగణంలో తమ దేశాల జాతీయ జెండాలను ప్రదర్శిస్తూ గీతం విదేశీ విద్యార్ధులు భారీ ర్యాలీని నిర్వహించారు.

యువజనోత్సవంలో సందడి చేస్తున్న విదేశీ విద్యార్థులు

➡️