సచివాలయాలతోనే గ్రామ స్వరాజ్యం 

Dec 8,2023 21:17

ప్రజాశక్తి – కురుపాం :   సచివాలయాలతోనే గ్రామ స్వరాజ్య పాలన సాగుతుందని స్థానిక ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి అన్నారు. శుక్రవారం జియ్యమ్మవలస మండలంలో గల బిజెపురంలో రూ.38.6 లక్షలతో కొత్తగా నిర్మించిన సచివాలయ భవనాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వ పథకాలు గ్రామస్థాయిలోనే ప్రజలకు నేరుగా అందాలని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి వాలంటరీ ద్వారా సంక్షేమ పథకాలు అందజేస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో జెడ్‌పిటిసి సభ్యులు ఎం.శశికళ, స్థానిక సర్పంచులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

➡️