సమగ్ర శిక్ష ఉద్యోగులు నిరసన

ప్రజాశక్తి- రేగిడి : స్థానిక మండల రిసోర్స్‌ కార్యాలయంలో సమగ్ర శిక్షాలో పనిచేస్తున్న ఉద్యోగ సిబ్బందిని రెగ్యులర్‌ చేయాలని, తక్షణమే వేతన బకాయిలు చెల్లించాలని కోరుతూ మంగళవారం గాంధీ, అంబేద్కర్‌ విగ్రహాలకు వినతి పత్రం అందించారు. సమగ్ర శిక్షా జెఎసి పిలుపుమేరకు మూడు రోజులుగా పెండౌన్‌ కార్యక్రమంలో భాగంగా గాంధీ, అంబేద్కర్‌ విగ్రహాం తదితర నాయకులకు వినతిపత్రం అందించారు. సమస్యలు పరిష్కరించకుంటే ధర్నాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.. ఈ కార్యక్రమంలో మండల జెఎసి అధ్యక్షులు పొన్నాడ అప్పలనాయుడు, ఎంఐఎస్‌ కోఆర్డినేటర్‌ శ్రీనివాసరావు, సిఆర్‌పిలు చందర్రావు, మోహన్శిరావుతో పాటు వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు పాల్గొన్నారు.వేపాడ : మండల కేంద్రంలోని మండల విద్యా వనరుల శాఖ కార్యాలయం వద్ద అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బంది మంగళశారం నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను పర్మినెంట్‌ చేయాలని వేతనంతో కూడిన సెలవులను మంజూరు చేయాలని, పెండింగ్‌ వేతనాలు విడుదల చేయాలని, మెడికల్‌ లీవ్‌లు మంజూరు చేయాలని నినాదాలు చేస్తూ పెన్‌డౌన్‌ చేశారు.

➡️