సమగ్ర శిక్ష ఉద్యోగుల భిక్షాటన

Dec 19,2023 15:45 #anakapalle district

 ప్రజాశక్తి -కశింకోట(అనకాపల్లి) : కశింకోటలో విద్యాశాఖ-సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగులు తమ హక్కుల సాధన కొరకు మూడవ రోజు పెన్డౌన్‌ కార్యక్రమాన్ని మంగళవారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా మండలంలో పనిచేస్తున్న సిఆర్‌ఎంటిలు, డేటా ఎంట్రీ ఆపరేటర్‌, అకౌంటెంట్‌,పిటిఐలు ఖాళీ పాత్రలతో బిక్షాపన చేశారు. సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలని ఉద్యోగ భద్రత ఆరోగ్య భద్రత సకాలంలో జీతాలు వంటివి అమలు చేయాలని మొత్తం 15 డిమాండ్లతో రేపటి నుంచి సమ్మె బాట పడుతున్నట్లు మండల అధ్యక్షులు డి.లక్ష్మణ, పి.సత్తిబాబు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో ఝాన్సీ, రామలక్ష్మి, సురేష్‌, సత్యారావు, సూర్యదాసు మొదలైన సమగ్ర శిక్ష ఉద్యోగులు పాల్గొన్నారు.

➡️