సమస్యలను పరిష్కరించాలని వినతి

Feb 27,2024 21:37
ఫొటో : వినతిపత్రం అందజేస్తున్న సిపిఎం నాయకులు

ఫొటో : వినతిపత్రం అందజేస్తున్న సిపిఎం నాయకులు
సమస్యలను పరిష్కరించాలని వినతి
ప్రజాశక్తి ఆత్మకూరు అర్బన్‌ : ఆత్మకూరు మున్సిపల్‌ పరిధిలోని సమస్యలను పరిష్కరించాలని సిపిఎం ఎల్‌ఆర్‌పల్లి శాఖ ఆధ్వర్యంలో పలు సమస్యలపై మంగళవారం మున్సిపల్‌ కార్యాలయంలో కమిషనర్‌ షేక్‌.ఫజులుల్లాకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం ఎల్‌ఆర్‌పల్లి శాఖ కార్యదర్శి, మాజీ మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ షేక్‌.సంధాని మాట్లాడుతూ మున్సిపల్‌ పరిధిలోని మూడవ వార్డు, లక్ష్మణరావుపల్లి, సావిడిసెంటర్‌ నుండి రామాలయం వీధి చివరివరకు మంజూరైన సిసిరోడ్డు పనులు వెంటనే ప్రారంభించాలన్నారు. మాసుం డ్రెయినేజీ కాలువ పడిపోయి మురుగు నీరు ఇళ్లలోకి వస్తున్నాయని తెలిపారు. వెంటనే కాలువను శుభ్రపరిచి నూతన డ్రెయినేజీ నిర్మాణం చేపట్టాలన్నారు. ఎస్‌ఎంకె పార్కులో ఉన్న ముళ్లపొదలను తొలిగించి దానిని పార్కుగా చేసి విద్యార్థులకు, ప్రజలకు పార్కుగా అందుబాటులో ఉంచాలని పైసమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు వాగాల శ్రీహరి, కృష్ణ మోహన్‌, కాలేషా, గ్రంధి సుధాకర్‌ పాల్గొన్నారు.

➡️