సమస్యలపై ఫీల్డ్‌ అసిస్టెంట్స్‌ వినతి

సమస్యలపై ఫీల్డ్‌ అసిస్టెంట్స్‌ వినతి

ప్రజాశక్తి – సీతానగరం తమ సమస్యలు పరిష్కరించాలని ఫీల్డ్‌ అసిస్టెంట్స్‌ యూనియన్‌ ఉపాధ్యక్షుడు సుంకవల్లి పోశారావు ఆధ్వర్యంలో ఎంపిడిఒ రమేష్‌కు బుధవారం వినతిపత్రం అందజేశారు. ఫీల్డ్‌ అసిస్టెంట్ల సంఘం జిల్లా అధ్యక్షుడు కోడెల్లి ప్రకాష్‌ మాట్లాడుతూ తమ సమస్యలపై 17 ఏళ్ల నుంచి సుదీర్ఘ పోరాటాలు చేస్తున్నామన్నారు. ప్రభుత్వాలు మారుతున్నాయి, పాలకులు మారుతున్నారు. అయినా ఫీల్డ్‌ అసిస్టెంట్ల సమస్యలు తీరడం లేదని తెలిపారు. సమస్యల పరిష్కార దిశగా ఈ నెల 18న ప్రతి జిల్లాలో చలో కలెక్టరేట్‌ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. 2024 జనవరి ఐదో తారీఖున చలో విజయవాడ కార్యక్రమం ద్వారా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాలకు తూర్పు గోదావరి జిల్లా 18 మండలాల నుంచి ఫీల్డ్‌ అసిస్టెంట్స్‌ అందరు పాల్గొని పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తోరం కృష్ణవేణి, బందిల రామారావు, కన్నాబత్తుల భాస్కరరావు, పి.రామకృష్ణ, కె.జ్యోతి, జి.చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.

➡️