సమస్యలు పరిష్కరించని సమావేశాలెందుకు?

ప్రజాశక్తి-కంభం రూరల్‌: కంభం గ్రామ పంచాయతీ పరిధిలో సాధారణ సమావేశాన్ని గురువారం వార్డు మెంబర్లు బహిష్కరించారు. తమ వార్డుల లో ఉన్న సమస్యలను అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకొని వెళ్లినా పరిష్కరించలేదని, అంతమాత్రానికి సమావేశాలెం దుకని ప్రశ్నించారు. పలువురు వార్డు మెంబర్లు పేర్కొన్నారు. ముఖ్యంగా గత మూడు సంవత్సరాలుగా పారిశుధ్యం, విద్యుత్‌ సమస్య, కుక్కలు, దోమల బెడద, నీటి సౌకర్యం తదితర సమస్యలపై అధికారులు, సర్పంచ్‌ స్పందించడం లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో మూడో వార్డు సభ్యులు కదం స్వర్ణలత బాయి, నాలుగో వార్డ్‌ వెంకటేశ్వర్లు, ఐదో వార్డు ఇబ్రహీం, ఏడవ వార్డు అత్తర్‌ షేక్‌ హుస్సేన్‌ (దాదా), 9వ వార్డు కంఠ రంగలక్ష్మి 13వ వార్డు నల్లబోతుల వెంకటమ్మ, 14వ వార్డు చాంద్‌బీ తదితరులు పాల్గొన్నారు.

➡️