సమస్యలు పరిష్కారమయ్యే వరకూ సమ్మె

Dec 21,2023 23:39
మగ్ర శిక్ష ఉద్యోగుల

ప్రజాశక్తి – రాజమహేంద్రవరం

సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలను పరిష్కరించే వరకు సమ్మె విరమించేది లేదని జెఎసి అధ్యక్షులు రఘు నాథ్‌ స్పష్టం చేశారు. ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె శుక్రవారం విజయవంతంగా రెండవ రోజుకు చేరుకుంది. ఈ కార్య క్రమంలో భాగంగా జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన కార్యక్రమం చేపట్టారు. సమగ్ర శిక్ష జెఎసికి ఉద్యోగ సంఘాల నుంచి మద్దతు లభించింది. జిల్లా నలుముళ్ళలా నుంచి ఉద్యోగులు అధిక సంఖ్యలు పాల్గొన్నారు. అలాగే జెఎసి నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి గౌరవాధ్యక్షులుగా వంశీ, మిరప రాజు, అధ్య క్షులుగా రఘునాథ్‌, ఉపాధ్యక్షులుగా వెంకట్‌ , ఆర్‌.దుర్గాప్రసాద్‌ ఎన్నికయ్యారు. ప్రభు త్వం తమ డిమాండ్‌లను పరిష్కరించే వరకు సమ్మె విరమించేది లేదన్నారు.

➡️