సమస్యల పరిష్కారమే థ్యేయం

ప్రజాశక్తి-ర్శి : ప్రజా సమస్యలు పరిష్కారమే తమ థ్యేయమని జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ, మాజీ ఎమ్మెల్యే, వైసిపి దర్శి నియోజక వర్గ ఇన్‌ఛార్జి డాక్టర్‌ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి తెలిపారు. దర్శి పట్టణంలోని 10వ వార్డు లంకోజనపల్లి రోడ్డులో ఇంటింటీ ప్రచారం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్య మంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగానే అనే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. నాడు- నేడు పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌ పాఠశాలలకు ధీటుగా తిర్చి దిద్దు తున్నట్లు తెలిపారు. సాయంత్రం తాళ్లూరు మండలం నాగంబొట్లపాలెం గ్రామంలో ఇంటింటికీ మన శివన్న కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అభిమానులు పూల వర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్ర మంలో వైసిపి మండల అధ్యక్షుడు వెన్నపూస వెంకటరెడ్డి, తూము సుబ్బారెడ్డి, షేక్‌ కార్పొరేషన్‌ డైరక్టర్‌ ఎస్‌ఎం బాషా, కుమ్మిత అంజిరెడ్డి, నాగంబొట్లపాలెం సర్పంచి సుబ్బారావు, శ్రీనివాసరెడ్డి, అనిల్‌, రాజశేఖర్‌, సుబ్బారెడ్డి పాల్గొన్నారు.

➡️