సమస్యల పరిష్కారమే థ్యేయం

ప్రజాశక్తి-దర్శి : గ్రామాల్లోని సమస్యల పరిష్కారమే తమ థ్యేయమని జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ, వైసిపి దర్శి నియోజకవర్గ ఇన్‌ఛార్జి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి తెలిపారు. దర్శి నగర పంచాయతీ పరిధిలోని 17వ వార్డులో శుక్రవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తరువాత గ్రామాల్లో ఇంటింటికి ప్రభుత్వ పథకాలు అందినట్లు తెలిపారు. గ్రామాల్లోని సమస్యలను చోట తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామని తెలిపారు. తొలుత బూచేపల్లికి మహిళలకు హారతి ఇచ్చి స్వాగతం పలికారు. మసీదుల్లో ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. ఈ సందర్భంగా అభిమానులు శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వైసిపి మండల అధ్యక్షుడు వెన్నపూస వెంకటరెడ్డి, కార్పొరేషన్‌ డైరెక్టర్లు ఎస్‌ఎం. బాషా, కుమ్మిత అంజిరెడ్డి, వైస్‌ ఎంపిపిలు సోము దుర్గారెడ్డి, కొరివి ముసలయ్య, నాయకులు అచ్చయ్య, సర్పంచలు సంఘం అధ్యక్షుడు రామ్‌భూపాల్‌రెడ్డి, కొల్లా భాస్కర్‌, వైసిపి పట్టణ అధ్యక్షుడు కట్టికోట హరీష్‌, 17వ వార్డు నాయకులు పానెం రెహమాన్‌, మజ్ను వలి, వెంకటరెడ్డి, హుస్సేన్‌, కోటేశ్వరరావు పాల్గొన్నారు.

➡️